గాజువాక, పెదగంట్యాడ (పున్నమి ప్రతినిధి ): వచ్చే అక్టోబర్‌లో వృద్ధులు, వితంతువులకు కొత్త పింఛన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ప్రతి నెలా ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. గాజువాక 65వ వార్డు వికాస్‌నగర్‌లో మంగళవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా రూ.2,700 కోట్ల పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తూ పారదర్శక పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.



