నంద్యాల : నూనెపల్లిలోని పురపాలక ఉన్నత పాఠశాల ఆవరణలో నంద్యాల పురపాలక సంఘం, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ నంద్యాల’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు స్వచ్ఛత, మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాలని, పరిశుభ్రమైన, పచ్చని నంద్యాల నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎమ్ ఈ నాగభూషణం రెడ్డి. మెప్మా పీడీ వెంకట దాసు, మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు విక్రమ్. శభరిష్. శానిటేషన్ సూపరైజర్ లక్ష్మినారాయణ. శివ ప్రసాద్ రెడ్డి. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

స్వచ్ఛ నంద్యాలకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు మంత్రి ఫరూక్ పిలుపు