Friday, 4 September 2026
  • Home  
  • సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- ASIFABAD

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అవగాహన ద్వారానే సైబర్ మోసాలను అరికట్టవచ్చు సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొండగుర్ల కమలాకర్ కొమరం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 31 (పున్నమి రిపోర్టర్): సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, వ్యక్తిగత మరియు బ్యాంకు సంబంధిత సమాచారాన్ని గుర్తుతెలియని వ్యక్తులతో పంచుకోవద్దని సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు, సైబర్ క్రైమ్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ కొండగుర్ల కమలాకర్ అన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్ మండలం బట్టుపల్లి గ్రామంలో సమాచార హక్కు రక్షణ చట్టం–2005 సొసైటీ జిల్లా అధ్యక్షులు వంగారి ప్రవీణ్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కమలాకర్ మాట్లాడుతూ సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దని సూచించారు. మొబైల్ ఫోన్లకు వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లు, వాట్సాప్ లింకులు, ఏపీకే (APK) ఫైళ్లు, రివార్డ్ లేదా బహుమతి పేరుతో వచ్చే లింకులకు స్పందించవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా ఓటీపీని ఎవరితోనూ పంచుకోవద్దని, అనుమానాస్పద ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బెట్టింగ్ యాప్‌లు, అక్రమ ఆన్‌లైన్ పథకాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇటీవల పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాల పట్ల ప్రజలు ప్రత్యేక అప్రమత్తతతో ఉండాలని పేర్కొన్నారు. పోలీసు శాఖ లేదా ఇతర ప్రభుత్వ సంస్థల పేరుతో భయపెట్టి డబ్బులు పంపాలని ఎవరైనా కోరితే వెంటనే నమ్మవద్దని, సంబంధిత అధికారులను సంప్రదించి నిజానిజాలు తెలుసుకోవాలని తెలిపారు. ప్రజల్లో సరైన అవగాహన పెంపొందించడం ద్వారానే సైబర్ మోసాలను గణనీయంగా అరికట్టవచ్చని అన్నారు. సైబర్ మోసానికి గురైనట్లు లేదా ఏదైనా అనుమానం వచ్చిన వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు. అత్యవసరంగా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని, అలాగే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని తెలిపారు. పోలీసు శాఖ అధికారులు, బ్యాంకు అధికారులు జారీ చేసే భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ జిల్లా కోశాధికారి గజ్జల తిరుపతి, కాగజ్‌నగర్ డివిజన్ అధ్యక్షులు మదాసు నాగేష్, కాగజ్‌నగర్ మండల అధ్యక్షులు కడరి శ్రీనివాస్, మండల సహాయ కార్యదర్శి సంతోష్, మండల ఉపాధ్యక్షులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అవగాహన ద్వారానే సైబర్ మోసాలను అరికట్టవచ్చు

సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొండగుర్ల కమలాకర్

కొమరం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 31 (పున్నమి రిపోర్టర్): సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, వ్యక్తిగత మరియు బ్యాంకు సంబంధిత సమాచారాన్ని గుర్తుతెలియని వ్యక్తులతో పంచుకోవద్దని సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు, సైబర్ క్రైమ్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ కొండగుర్ల కమలాకర్ అన్నారు.

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్ మండలం బట్టుపల్లి గ్రామంలో సమాచార హక్కు రక్షణ చట్టం–2005 సొసైటీ జిల్లా అధ్యక్షులు వంగారి ప్రవీణ్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కమలాకర్ మాట్లాడుతూ సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.

గుర్తుతెలియని వ్యక్తులకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దని సూచించారు. మొబైల్ ఫోన్లకు వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లు, వాట్సాప్ లింకులు, ఏపీకే (APK) ఫైళ్లు, రివార్డ్ లేదా బహుమతి పేరుతో వచ్చే లింకులకు స్పందించవద్దని హెచ్చరించారు.

ముఖ్యంగా ఓటీపీని ఎవరితోనూ పంచుకోవద్దని, అనుమానాస్పద ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బెట్టింగ్ యాప్‌లు, అక్రమ ఆన్‌లైన్ పథకాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇటీవల పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాల పట్ల ప్రజలు ప్రత్యేక అప్రమత్తతతో ఉండాలని పేర్కొన్నారు.

పోలీసు శాఖ లేదా ఇతర ప్రభుత్వ సంస్థల పేరుతో భయపెట్టి డబ్బులు పంపాలని ఎవరైనా కోరితే వెంటనే నమ్మవద్దని, సంబంధిత అధికారులను సంప్రదించి నిజానిజాలు తెలుసుకోవాలని తెలిపారు. ప్రజల్లో సరైన అవగాహన పెంపొందించడం ద్వారానే సైబర్ మోసాలను గణనీయంగా అరికట్టవచ్చని అన్నారు.

సైబర్ మోసానికి గురైనట్లు లేదా ఏదైనా అనుమానం వచ్చిన వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు. అత్యవసరంగా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని, అలాగే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని తెలిపారు. పోలీసు శాఖ అధికారులు, బ్యాంకు అధికారులు జారీ చేసే భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ జిల్లా కోశాధికారి గజ్జల తిరుపతి, కాగజ్‌నగర్ డివిజన్ అధ్యక్షులు మదాసు నాగేష్, కాగజ్‌నగర్ మండల అధ్యక్షులు కడరి శ్రీనివాస్, మండల సహాయ కార్యదర్శి సంతోష్, మండల ఉపాధ్యక్షులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.