షర్మిలమ్మతో కలిసి వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సయ్యద్ గౌస్ పీర్
ఇడుపులపాయ, సెప్టెంబర్ 2:
పున్నమి ప్రతినిధి: మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కడప నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మతో కలిసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కడప నగర కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతంపై షర్మిలమ్మతో చర్చించారు.
కడప నగరంలో కొనసాగుతున్న “ఇంటింటికి కాంగ్రెస్” 100 రోజుల కార్యక్రమాన్ని షర్మిలమ్మ అభినందించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించేలా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో మరింతగా పనిచేయాలని ఆమె సూచించారు. కడప నగరంలో కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు షర్మిలమ్మ సహకారం, మార్గదర్శకత్వం అందించాలని గౌస్ పీర్ కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఫజరుల్లా, కరిముల్లా, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.






