నర్సింగ్ ఉద్యోగిని ఊకె శిరీషపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అవసరమైతే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో బీజేపీ శ్రేణులు, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంతు జ్వాలా నరసింహారావు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆర్వీఎస్ యాదవ్, ఆదివాసీ రాష్ట్ర నాయకులు దొడ్డ అరుణ అక్క, పమ్మి అనిత, భవాని, ఐటీ సెల్ కన్వీనర్ బోయినపల్లి సురేష్, ట్రెజరర్ లక్ష్మి నారాయణ, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మంద సరస్వతి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శాసనల సాయిరాం, గుత్తా వంశీ, బోయినపల్లి చంద్రశేఖర్, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి గంధసిరి వీరభద్రం గౌడ్, ఖమ్మం అర్బన్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆచంటి కోటేశ్వరరావు, రెండవ పట్టణ ప్రధాన కార్యదర్శి రుద్ర గాని మాధవ్ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి అనగాని రామారావు, లింగనబోయిన వెంకటేశ్వర్లు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.


