నంద్యాల: వినాయక విగ్రహాల నిమజ్జనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నంద్యాల చెరువులో నీటిని సిద్ధం చేసినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. చెరువు వద్ద జరుగుతున్న పారిశుధ్య పనులను శుక్రవారం మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న ప్రత్యక్షంగా పరిశీలించారు.నిమజ్జన ప్రాంతంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. భక్తులకు సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు విక్రమ్, శభరిష్, శానిటేషన్ సూపర్వైజర్లు మురళీధర్, శివ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వినాయక నిమజ్జనానికి నంద్యాల చెరువు సిద్ధం