రంగంపేట, సెప్టెంబరు 1 (పున్నమి ప్రతినిధి):
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా రంగంపేట మండలం చండ్రేడు గ్రామంలో నూతనంగా మంజూరైన వితంతు పింఛన్లను లబ్ధిదారులకు అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి అందజేశారు. అదే కార్యక్రమంలో భాగంగా రంగంపేటలో డయాలసిస్ రోగికి పింఛన్ అందించారు.
ఈ సందర్భంగా నల్లమిల్లి మనోజ్ రెడ్డి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. సామాజిక భద్రత పింఛన్ల ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారం కొనసాగుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



