Friday, 4 September 2026
  • Home  
  • వికలాంగులు, మహిళల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ కట్టుబాటు
- నిర్మల్

వికలాంగులు, మహిళల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ కట్టుబాటు

కొండాపూర్: బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో వికలాంగులు, మహిళల సమస్యలు, సంక్షేమం మరియు వారి హక్కులపై అవగాహన కల్పించే కార్యక్రమం కొండాపూర్‌లోని తెలంగాణ బీఆర్‌ఎస్‌ పార్టీ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వికలాంగులు, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ టౌన్‌ ప్రెసిడెంట్ మారుగొండ రామన్న, మాజీ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు నజీర్‌ ఖాన్, కె. సుశీల్‌ కుమార్‌ రావు, బీఆర్‌ఎస్‌ మాజీ రాష్ట్ర యువజన కార్యదర్శి, నర్సాపూర్‌ బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సుదర్శన్‌, నిర్మల్‌ జిల్లా సీనియర్‌ నాయకులు ఎం.డి. మహబూబ్‌, బీఆర్‌ఎస్‌ నిర్మల్‌ టౌన్‌ సెక్రటరీ నయీమ్‌, నిర్మల్‌ జిల్లా యువజన నాయకులు జుబేర్‌, బి. సాయికుమార్‌, కిరణ్‌ రావు, సోన్‌ మండల యువజన నాయకులు, సోన్‌ మండల సీనియర్‌ నాయకులు నరసయ్య తదితరులు పాల్గొన్నారు. సదస్సులో వికలాంగులు, మహిళల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

కొండాపూర్: బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో వికలాంగులు, మహిళల సమస్యలు, సంక్షేమం మరియు వారి హక్కులపై అవగాహన కల్పించే కార్యక్రమం కొండాపూర్‌లోని తెలంగాణ బీఆర్‌ఎస్‌ పార్టీ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వికలాంగులు, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ టౌన్‌ ప్రెసిడెంట్ మారుగొండ రామన్న, మాజీ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు నజీర్‌ ఖాన్, కె. సుశీల్‌ కుమార్‌ రావు, బీఆర్‌ఎస్‌ మాజీ రాష్ట్ర యువజన కార్యదర్శి, నర్సాపూర్‌ బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సుదర్శన్‌, నిర్మల్‌ జిల్లా సీనియర్‌ నాయకులు ఎం.డి. మహబూబ్‌, బీఆర్‌ఎస్‌ నిర్మల్‌ టౌన్‌ సెక్రటరీ నయీమ్‌, నిర్మల్‌ జిల్లా యువజన నాయకులు జుబేర్‌, బి. సాయికుమార్‌, కిరణ్‌ రావు, సోన్‌ మండల యువజన నాయకులు, సోన్‌ మండల సీనియర్‌ నాయకులు నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
సదస్సులో వికలాంగులు, మహిళల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.