Thursday, 3 September 2026
  • Home  
  • వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా మదర్ థెరిస్సా జయంతి వేడుకలు
- తూర్పు గోదావరి

వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా మదర్ థెరిస్సా జయంతి వేడుకలు

*జగ్గంపేట వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా మదర్ థెరిస్సా జయంతి వేడుకలు* *కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి , ఆగస్టు 26:* మానవసేవే మాధవసేవగా భావించి అనేక సేవా కార్యక్రమాలు అందించిన అమృతమూర్తి, దయామయి మదర్ థెరిస్సా జయంతి వేడుకలు వాకర్స్ హెల్త్ క్లబ్ (జగ్గంపేట) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మదర్ థెరిస్సా సేవలను స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట వాకర్స్ క్లబ్ ఫౌండర్, మాజీ జిల్లా గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు( కొండబాబు) మాట్లాడుతూ మానవతా మూర్తి, మానవసేవే మాధవసేవగా భావించే మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా ఒక పవిత్రమైన సేవా కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.ఆమె సమాజానికి అందించిన అసమాన త్యాగాన్ని, పవిత్ర సేవలను స్మరించుకుంటూ ఆమె చూపిన కరుణా మార్గంలో పయనించడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం రోగుల ఆరోగ్యం, సంతోషం కొరకు ఆకాంక్షించడం, సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనే సందేశాన్ని వ్యాప్తి చేయడం, మదర్ థెరిస్సా సేవానిరతిని ఆదర్శంగా తీసుకుని ఇటువంటి సేవా కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలోవాకర్స్ క్లబ్ ఫౌండర్, మాజీ జిల్లా గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు (కొండబాబు) వెచ్చ నాగసత్య ఎం సురేష్, చంద్రమౌళి వెంకట శాస్త్రి, రాజేష్ పొట్టి రాజేష్:వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

*జగ్గంపేట వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా మదర్ థెరిస్సా జయంతి వేడుకలు*

*కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి , ఆగస్టు 26:*

మానవసేవే మాధవసేవగా భావించి అనేక సేవా కార్యక్రమాలు అందించిన అమృతమూర్తి, దయామయి మదర్ థెరిస్సా జయంతి వేడుకలు వాకర్స్ హెల్త్ క్లబ్ (జగ్గంపేట) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
మదర్ థెరిస్సా సేవలను స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జగ్గంపేట వాకర్స్ క్లబ్ ఫౌండర్, మాజీ జిల్లా గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు( కొండబాబు) మాట్లాడుతూ మానవతా మూర్తి, మానవసేవే మాధవసేవగా భావించే మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా ఒక పవిత్రమైన సేవా కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.ఆమె సమాజానికి అందించిన అసమాన త్యాగాన్ని, పవిత్ర సేవలను స్మరించుకుంటూ ఆమె చూపిన కరుణా మార్గంలో పయనించడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం రోగుల ఆరోగ్యం, సంతోషం కొరకు ఆకాంక్షించడం, సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనే సందేశాన్ని వ్యాప్తి చేయడం, మదర్ థెరిస్సా సేవానిరతిని ఆదర్శంగా తీసుకుని ఇటువంటి సేవా కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలోవాకర్స్ క్లబ్ ఫౌండర్, మాజీ జిల్లా గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు (కొండబాబు) వెచ్చ నాగసత్య ఎం సురేష్, చంద్రమౌళి వెంకట శాస్త్రి, రాజేష్ పొట్టి రాజేష్:వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.