*ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ*
రాజంపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, *రాజంపేట జనసేన పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ యల్లటూరు శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.*
ఉదయం 8.15 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో *శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత విజయాలు ప్రసాదించాలని 108 కొబ్బరి కాయలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.*
8.45 గంటలకు శ్రీ కృష్ణ దేవరాయలు, అల్లూరి సీతారామరాజు మరియు అంబేద్కర్ గారి విగ్రహాలకు పాలాభిషేకం సమర్పించి, పూలదండలతో అలంకరించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి జనసేన పార్టీ పట్ల తమ అభిమానాన్ని, ఉత్సాహాన్ని చాటుకున్నారు.
10.30 గంటలకు కేక్ కటింగ్ మరియు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి ప్రజాసేవ, యువతకు అందిస్తున్న ప్రోత్సాహం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని నాయకులు కొనియాడారు.
అనంతరం భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాసరాజు గారు మాట్లాడుతూ, *పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని కేవలం వేడుకగా కాకుండా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.* ప్రజాసేవ, యువత అభ్యున్నతి, సమాజ సంక్షేమం కోసం జనసేన శ్రేణులు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
యల్లటూరు శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ జన్మదిన వేడుకలు భక్తి, సేవా స్ఫూర్తి, యువత ఉత్సాహంతో ఘనంగా విజయవంతమయ్యాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.


