ఆత్మకూరు: మండలంలోని నబ్బీనగరం గ్రామానికి చెందిన చీర్ల పాపయ్య (55) కట్టెల కోసం అడవికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సెప్టెంబర్ 1న కట్టెల కోసం అడవికి వెళ్లిన పాపయ్య తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. అనంతరం నబ్బీనగరం–వింజమూరు మార్గంలోని కల్వర్టు కింద ఆయన మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ గంగాధర్, ఎస్ఐ జంపాని కుమార్ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పాపయ్య మృతికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియరాలేదని, పోస్టుమార్టం నివేదిక అనంతరం అసలు కారణం వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు.

అడవికి వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి