పున్నమి ప్రతినిధి :ఆనంద్
యలమంచిలి : జిల్లా విద్యాశాఖ అధికారి వారి ఆదేశాల మేరకు బుధవారం ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తపేట నందు ప్రధానోపాధ్యాయులు వైవి రమణ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఓజోన్ పొర ఆవశ్యకతను తెలియజేసేలా చిత్రలేఖనం పోటీలు ఏర్పాటు చేశారు. ఓజోన్ పొర పరిరక్షణ మనందరి కర్తవ్యం అని, తద్వారా సకల జీవరాశికి ఎంతో మేలు జరుగుతుందని తెలియజేశారు. విరివిగా మొక్కలను పెంచడం ద్వారా, అడవులను సంరక్షించుకోవడం ద్వారా, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవడం ద్వారా ఓజోన్ పొరను కాపాడుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంగపతిరావు, కుందూరు రాజు, కిషోర్ కుమార్, ప్రసన్న కుమారి, కార్తీక, కౌసల్య, రామలక్ష్మి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


