రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్
మంథని పట్టణ అభివృద్ధి మంత్రి శ్రీధర్ బాబు ధ్యేయమని మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి తెలిపారు. గురువారం మంథని పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను మున్సిపల్ కమిషనర్ మనోహర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భాగంగా జరుగుతున్న పనుల్లో నష్టపోతున్న వారిని సంప్రదించి పనులు ముందుకు తీసుకెళ్లాలని తమకు మంత్రి శ్రీధర్ బాబు సూచించారని వారు తెలిపారు. అభివృద్ధి పనుల్లో ఎక్కడ కూడా పక్షపాత వైఖరి అవలంబించవద్దని మంత్రి సూచించినట్లు వారు పేర్కొన్నారు. నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. మూల మలుపుల వద్ద అలాగే నాలుగు రోడ్లు కలిసే ప్రాంతం విస్తారంగా ఉండాలని ప్రణాళికలను రూపొందించినట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పదో వార్డ్ కౌన్సిలర్ పెంటరి రాజు తో పాటు గ్రామస్తులు మహావాది విజయ్ కుమార్, రంగి అమర్నాథ్, జక్కం రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

