రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను ఒంటిమిట్ట మండల టీడీపీ నాయకులు గురువారం రాష్ట్ర సచివాలయంలోని మంత్రి పేషీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట మండల టీడీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య, రాష్ట్ర ఆర్ఎంపీ వైద్యుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ గారి శివకుమార్, డాక్టర్ శ్రీధర్ కుమార్‌లు మంత్రిని శాలువాతో సత్కరించి, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. చారిత్రక,ఇతిహాస ప్రాశస్త్యం కలిగిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని సందర్శించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను నాయకులు ఆహ్వానించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తిరుపతి వెళ్లే సమయంలో తప్పకుండా ఒంటిమిట్టకు వచ్చి శ్రీ కోదండరామస్వామిని దర్శించుకుంటానని తెలిపారు. తిరుమల పర్యటనకు వెళ్లే సమయాన్ని ముందుగా తెలియజేస్తానని మంత్రి చెప్పడంతో నాయకులు హర్షం వ్యక్తం చేశారు.అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల స్పందన ఎలా ఉందని మంత్రి నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కడప జిల్లాలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చెప్పుకునే స్థాయిలో అభివృద్ధి పనులు జరగలేదని వారు మంత్రికి వివరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకి గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ సందర్శనకు మంత్రి సానుకూలంగా స్పందించడం, స్థానిక సమస్యలు మరియు అభివృద్ధి అంశాలపై ఆరా తీయడంతో టీడీపీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


