Friday, 4 September 2026
  • Home  
  • భారత్‌లో హెచ్‌ఐవీ నివారణకు ” లెనాకాపవిర్ ” ఇంజెక్షన్
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

భారత్‌లో హెచ్‌ఐవీ నివారణకు ” లెనాకాపవిర్ ” ఇంజెక్షన్

హెచ్‌ఐవీ నివారణలో భారత్‌కు కీలక ముందడుగు పడింది. హెచ్‌ఐవీ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు ముందస్తు రక్షణగా (PrEP) ఉపయోగించే ‘లెనాకాపవిర్’ జెనరిక్ ఇంజెక్షన్‌ను దేశీయంగా తయారు చేసి విక్రయించేందుకు డాక్టర్ రెడ్డీస్, ఎమ్‌క్యూర్ ఫార్మాస్యూటికల్స్‌కు నిపుణుల కమిటీ అనుమతి లభించింది. ఈ ఇంజెక్షన్‌ను సాధారణంగా ఆరు నెలలకు ఒకసారి తీసుకోవాల్సి ఉండటంతో రోజువారీ మాత్రల అవసరం తగ్గనుంది. పేటెంట్‌దారు గిలీడ్ సైన్సెస్ లైసెన్సింగ్ ద్వారా భారత కంపెనీలు దీన్ని తక్కువ ధరకు ఉత్పత్తి చేయనున్నాయి. ప్రస్తుతం అమెరికా వంటి దేశాల్లో చికిత్స ఖర్చు చాలా అధికంగా ఉండగా, జెనరిక్ ఉత్పత్తితో భారత్‌లో ధర గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ ఔషధం అందుబాటులోకి వస్తే హెచ్‌ఐవీ నివారణ మరింత సులభం, అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఉపయోగానికి ముందు హెచ్‌ఐవీ నెగెటివ్‌గా నిర్ధారణ కావడం, వైద్యుల సూచనలు పాటించడం తప్పనిసరి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.