జనగామ, సెప్టెంబర్ 4,పున్నమి జిల్లా ప్రతినిధి :
ఈరోజు భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు సౌడ రమేష్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కాసం వెంకటేశ్వర్లు గారు పాల్గొనడం జరిగింది
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22 A నిషేధిత జాబితాలో నిరుపేద రైతుల భూములు పేద ప్రజల ఓపెన్ ప్లాట్లు ప్రైవేట్ భూములు నిషేధిత జాబితాలో రాష్ట్ర ప్రభుత్వం చేర్చి పేద ప్రజలను రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ నిషేధిత జాబితా నుండి పేద ప్రజలకు రైతులకు న్యాయం చేయాలని రేపు అనగా శనివారము ఉదయంహైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో బుడుగుల రమేష్ పిట్టల సత్యం కొంతం శ్రీనివాస్ దేవర ఎల్లయ్య యువ మోర్చా అధ్యక్షుడు హరీష్ సంతోష్ అనిల్ జగదీష్ శివ మొదలగువారు పాల్గొన్నారు




