మాజీ మంత్రి జోగి రమేష్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి అండ చూసుకొని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి పైకి రౌడీ మూకలతో వెళ్లి దాడికి పాల్పడి మంత్రి పదవి కొట్టేసినాడని, ఈరోజు తన పై వస్తున్న విమర్శలను తట్టుకోలేక దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా నీతి వాక్యాలు పలకడం హాస్యాస్పదమని రాష్ట్ర కల్లుగీత కార్మికుల మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య ధ్వజమెత్తారు. ఒంటిమిట్టలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో నరసయ్య మాట్లాడుతూ మంత్రిగా ఉన్నప్పుడు జోగి రమేష్ మాట్లాడిన మాటలు, చేతలు, రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా మరువలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై హీనమైన భాష మాట్లాడిన జోగి రమేష్, నేడు తన కుటుంబ సభ్యులపై రాష్ట్రవ్యాప్తంగా సమాచారం మాధ్యమాల్లో వస్తున్న విమర్శలను తట్టుకోలేక న్యాయము ధర్మము అంటూ నీతి వాక్యాలు వల్లించడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగానే ఉందని వెంకట నరసయ్య అన్నారు. కొద్దిరోజులు కుల రాజకీయాలు చేసి బీసీ కార్డు ఉపయోగించి లబ్ధి పొందాలని చూసిన జోగి రమేష్, కులం కార్డు పనిచేయకపోవడంతో, తిరిగి తన కుటుంబ సభ్యులపై దాడి అని కొత్త కార్డు ప్లే చేస్తున్నారని, అన్నారు. నాకే కాదు, చంద్రబాబు గారికి కూడా కుటుంబం ఉందంటూ, తిరిగి తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చిన స్క్రిప్టును ప్రెస్ ముందుకు వచ్చి చదవడం ద్వారా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. చట్టం తన పని తాను చేసుకు పోతుందని రాబోయే రోజుల్లో మరిన్ని కుంభకోణాల్లో జోగి రమేష్ పాత్ర పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని అంతవరకు వేచి చూడాలని జోగ్ రమేష్ కు సలహా ఇచ్చారు. కులం కార్డు ఉపయోగిస్తే, తమ సామాజిక వర్గంలో సానుభూతి వస్తుందని జోగి రమేష్ చేసే ప్రకటనలు వ్యర్థమని, గతంలో చేసిన తప్పులను ఒప్పుకొని బహిరంగంగా పశ్చాత్తాపం ప్రకటిస్తే, అప్పుడు ప్రజలు కొంతమేరకు విశ్వసించే అవకాశం ఉంటుందని సలహా ఇస్తూ, ఈ మేరకు జోగి రమేష్ చంద్రబాబునాయుడు కి బహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర కల్లుగీత కార్మికుల సహకార ఆర్థిక సంస్థ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య డిమాండ్ చేశారు.


