Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జయశంకర్ భూపాలపల్లి

అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • భూపాలపల్లి, ఆగస్టు 20: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, మహాదేవపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 41 అంగన్‌వాడీ టీచర్ (AWT) పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
  • భూపాలపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 12 పోస్టులు, మహాదేవపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
  • దరఖాస్తుల ముఖ్య తేదీలు - దరఖాస్తుల ప్రారంభ తేదీ: 21.08.2026 - దరఖాస్తుల చివరి తేదీ: 02.09.2026 సాయంత్రం 5.00 గంటల వరకు - దరఖాస్తులను https://wdcw.tg.nic.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలి.

భూపాలపల్లి, ఆగస్టు 20: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, మహాదేవపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 41 అంగన్‌వాడీ టీచర్ (AWT) పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

భూపాలపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 12 పోస్టులు, మహాదేవపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

దరఖాస్తుల ముఖ్య తేదీలు

– దరఖాస్తుల ప్రారంభ తేదీ: 21.08.2026
– దరఖాస్తుల చివరి తేదీ: 02.09.2026 సాయంత్రం 5.00 గంటల వరకు
– దరఖాస్తులను https://wdcw.tg.nic.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలి.

అర్హతలు

అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 01.07.2026 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

అభ్యర్థులు సంబంధిత అంగన్‌వాడీ కేంద్రం పరిధిలోని గ్రామం/ఆవాసం/హ్యాబిటేషన్‌కు చెందిన స్థానిక మహిళ అయి ఉండాలి. సంబంధిత గ్రామ పంచాయతీ పరిధిలోని స్థానిక మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది.

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపిక ఇంటర్మీడియట్ మార్కులు, ప్రత్యేక కేటగిరీలకు కేటాయించిన మార్కులు, అనుభవం, విద్యార్హతలు మరియు జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ తదితర ప్రమాణాల ఆధారంగా మెరిట్ ప్రకారం జరుగుతుంది.

ఇంటర్మీడియట్ మార్కులకు 70 మార్కులు, ప్రత్యేక కేటగిరీలకు 20 మార్కులు, జిల్లా ఎంపిక కమిటీ ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించి మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు, ఖాళీల వివరాలు, మార్గదర్శకాలు మరియు దరఖాస్తు ప్రక్రియను https://wdcw.tg.nic.in/ వెబ్‌సైట్‌లో పరిశీలించాలని కోరారు.

— జిల్లా కలెక్టర్, జయశంకర్ భూపాలపల్లి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *