విజయవాడ, సెప్టెంబరు 7 (పున్నమి ప్రతినిధి): తూర్పుగోదావరి జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్చార్జులతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి టీడీపీ ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయ, అభివృద్ధి అంశాలతో పాటు పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలతో మంత్రి నిమ్మల చర్చించారు.



