ఖమ్మం, జులై
(పున్నమి ప్రతినిధి జిల్లా రిపోర్టర్
/పువ్వాడ నాగేంద్ర కుమార్ )
నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో నిర్వహించిన “మార్చ్ టు పార్లమెంట్” సందర్భంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థులకు తమ సమస్యలను శాంతియుతంగా వ్యక్తం చేసే హక్కు ఉందని, వారిపై బలప్రయోగం చేయడం అమానవీయ చర్య అని పేర్కొన్నారు. విద్యార్థుల గొంతుకను అణిచివేసే చర్యలు సమర్థనీయం కావని, నిరసనకారులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



