నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ బుధవారం మినీ బైపాస్ రోడ్డులో పారిశుధ్య పనులను పరిశీలించారు. రోడ్డు వెంబడి టెంకాయలు విక్రయించే వ్యాపారులు వ్యర్థాలను ప్రత్యేక బుట్టల్లో సేకరించి చెత్త వాహనాలకు లేదా డంపింగ్ యార్డుకు తరలించాలని ఆదేశించారు. రోడ్డు పక్కన వ్యర్థాలు వేస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అలాగే రహదారిని ఆక్రమించకుండా నిర్దేశిత మార్జిన్‌లోనే వ్యాపారం నిర్వహించి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

టెంకాయ వ్యర్థాలపై చర్యలు : వై.ఓ. నందన్