ఓడలరేవు, పున్నమి దినపత్రిక: ఓడలరేవు గ్రామంలో గల్లంతైన మత్సకారుల కుటుంబాలను వైయస్సార్సీపి నియోజవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్
పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి మత్స్యకార బోటుకు తప్పనిసరిగా ఉండాల్సిన జిపిఎస్ ట్రాకర్లు, ఎస్ఓ ఎస్ పరికరాలను అమర్చేందుకు కూడా మత్స్యకారుల నుంచి రూ.500 నుంచి రూ.1,000 వరకు లంచం డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మత్స్యకారుల భద్రతకు సంబంధించిన పరికరాల విషయంలో కూడా అవినీతి, చోటుచేసుకోవడం దురదృష్టకరమని, ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. విషాదకర పరిస్థితి నెలకొని, మత్స్యకారుల కుటుంబాలు తమ ఆత్మీయుల ఆచూకీ కోసం ఆందోళన చెందుతున్నప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఇప్పటివరకు స్పందించకుండా కుటుంబాలను పరామర్శించకపోవడంపై శ్రీకాంత్ తీవ్రంగా మండిపడ్డారు.
Uploaded Video:

Uploaded Video:


