Wednesday, 19 August 2026
  • Home  
  • దేవాలయం వద్ద వాతావరణ కలుషితంపై వైసీపీ నాయకుల ఆందోళన
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దేవాలయం వద్ద వాతావరణ కలుషితంపై వైసీపీ నాయకుల ఆందోళన

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 19 (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని బద్దేవోలు క్రాస్‌ రోడ్డు వద్ద వెలసిన సంగమేశ్వరస్వామి దేవాలయం సమీపంలో వైసీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. దేవాలయం పరిసర ప్రాంతంలో గిరిజన కుటుంబాలు నివసిస్తుండటంతో పరిసరాలు కలుషితమవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ఆలయ పవిత్రతకు భంగం కలుగుతోందని పేర్కొన్నారు. దేవాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 19 (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని బద్దేవోలు క్రాస్‌ రోడ్డు వద్ద వెలసిన సంగమేశ్వరస్వామి దేవాలయం సమీపంలో వైసీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. దేవాలయం పరిసర ప్రాంతంలో గిరిజన కుటుంబాలు నివసిస్తుండటంతో పరిసరాలు కలుషితమవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ఆలయ పవిత్రతకు భంగం కలుగుతోందని పేర్కొన్నారు. దేవాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.