Friday, 11 September 2026

Tag: NelloreMunicipalCorporation

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పరిశుభ్రతలో రాజీ వద్దు: కమిషనర్ వై.ఓ. నందన్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ శుక్రవారం నగరోదయం కార్యక్రమంలో భాగంగా పొదలకూరు రోడ్డు కూడలి పరిధిలోని శానిటేషన్ మస్టర్ పాయింట్‌ను తనిఖీ చేశారు. కార్మికుల హాజరును పరిశీలించి, విధుల్లో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. సిబ్బంది తప్పనిసరిగా రేడియం ఆప్రాన్స్ ధరించాలని ఆదేశించారు. నగర పరిశుభ్రతకు నిర్దేశించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. చెత్త సేకరణ వాహనాల సిబ్బంది తడి, పొడి వ్యర్థాలను విడివిడిగా సేకరించి రీసైక్లింగ్‌కు పంపించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శానిటేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

హరనాధపురంలో కమిషనర్ తనిఖీలు

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ సోమవారం 18వ డివిజన్ హరనాథపురంలో వివిధ విభాగాల అధికారులతో కలిసి పర్యటించారు. నూతనంగా నిర్మిస్తున్న డ్రైన్ల నాణ్యత, పనుల పురోగతిని పరిశీలించి మురుగునీరు సాఫీగా ప్రవహించేలా నిర్మాణాలు చేపట్టి, నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్త భవనాలు, అదనపు అంతస్తుల అనుమతులను పరిశీలించి పన్ను పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి వేకంట్ ల్యాండ్ ట్యాక్స్ వసూలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వాణిజ్య సంస్థలకు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా శానిటేషన్ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్, రెవెన్యూ, శానిటేషన్ అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టెంకాయ వ్యర్థాలపై చర్యలు : వై.ఓ. నందన్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ బుధవారం మినీ బైపాస్ రోడ్డులో పారిశుధ్య పనులను పరిశీలించారు. రోడ్డు వెంబడి టెంకాయలు విక్రయించే వ్యాపారులు వ్యర్థాలను ప్రత్యేక బుట్టల్లో సేకరించి చెత్త వాహనాలకు లేదా డంపింగ్ యార్డుకు తరలించాలని ఆదేశించారు. రోడ్డు పక్కన వ్యర్థాలు వేస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అలాగే రహదారిని ఆక్రమించకుండా నిర్దేశిత మార్జిన్‌లోనే వ్యాపారం నిర్వహించి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.