Thursday, 16 April 2026
  • Home  
  • గోదావరి గట్టు రోడ్డు పై చెత్త సంచుల గుట్టలు – ప్రమాదానికి నాంది పలుకుతున్న ప్రక్కిలంక మలుపు
- తూర్పు గోదావరి

గోదావరి గట్టు రోడ్డు పై చెత్త సంచుల గుట్టలు – ప్రమాదానికి నాంది పలుకుతున్న ప్రక్కిలంక మలుపు

పున్నమి ప్రతినిధి తాళ్లపూడి ప్రక్కిలంక, ఏప్రిల్ 16: ప్రక్కిలంక గ్రామంలో ఆంజనేయస్వామి గుడి సమీపంలోని మలుపు వద్ద రోడ్డు ప్రమాదకరంగా మారింది. రోడ్డు పక్కన కిందకు దిగే ప్రాంతంలో చెత్త సంచులు గుట్టలుగా పేరుకుపోవడంతో అక్కడి పరిస్థితి తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది.ముందుగా ఎటువంటి ప్రమాదం జరగకూడదని స్థానికుల సమాచారం ప్రకారం, రోడ్డు మలుపు వద్దనే ఈ సంచులు గుట్టలు ఉండడం వల్ల వాహనదారులకు దృష్టి మాయమవుతూ ప్రమాదాలకు అవకాశం పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ ప్రాంతం మరింత ప్రమాదకరంగా మారుతోంది. రోడ్డు పక్కన గట్టుగా పేరుకున్న సంచులు, వ్యర్థాలు ఎప్పుడైనా కిందకు జారిపడే ప్రమాదం కూడా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు సంబంధిత అధికారులను కోరుతూ, ఈ చెత్తను తక్షణమే తొలగించి రహదారిని శుభ్రపరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కూడా వారు సూచిస్తున్నారు. ఈ పరిస్థితిపై సంబంధిత శాఖలు వెంటనే స్పందించి, ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పున్నమి ప్రతినిధి తాళ్లపూడి ప్రక్కిలంక, ఏప్రిల్ 16:
ప్రక్కిలంక గ్రామంలో ఆంజనేయస్వామి గుడి సమీపంలోని మలుపు వద్ద రోడ్డు ప్రమాదకరంగా మారింది. రోడ్డు పక్కన కిందకు దిగే ప్రాంతంలో చెత్త సంచులు గుట్టలుగా పేరుకుపోవడంతో అక్కడి పరిస్థితి తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది.ముందుగా ఎటువంటి ప్రమాదం జరగకూడదని స్థానికుల సమాచారం ప్రకారం, రోడ్డు మలుపు వద్దనే ఈ సంచులు గుట్టలు ఉండడం వల్ల వాహనదారులకు దృష్టి మాయమవుతూ ప్రమాదాలకు అవకాశం పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ ప్రాంతం మరింత ప్రమాదకరంగా మారుతోంది. రోడ్డు పక్కన గట్టుగా పేరుకున్న సంచులు, వ్యర్థాలు ఎప్పుడైనా కిందకు జారిపడే ప్రమాదం కూడా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్థులు సంబంధిత అధికారులను కోరుతూ, ఈ చెత్తను తక్షణమే తొలగించి రహదారిని శుభ్రపరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కూడా వారు సూచిస్తున్నారు.
ఈ పరిస్థితిపై సంబంధిత శాఖలు వెంటనే స్పందించి, ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.