దేశంలోని ఎనిమిది ప్రధాన పారిశ్రామిక రంగాల వృద్ధిరేటు మే 2026లో కేవలం 0.5 శాతానికి పరిమితమైంది. గత 21 నెలల్లో ఇది రెండో అత్యల్ప స్థాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఎనిమిది రంగాల్లో ఐదు రంగాలు ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, బొగ్గు, ఎరువుల రంగాల్లో ఉత్పత్తి తగ్గింది. పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం రిఫైనరీ రంగంపై పడిందని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. అయితే ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాలు మాత్రం వృద్ధిని నమోదు చేశాయి. పారిశ్రామిక ఉత్పత్తి మందగించడం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

కోర్ రంగాల వృద్ధి 0.5 శాతానికి పడిపోవడం ఆందోళనకరం