Thursday, 3 September 2026
  • Home  
  • కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. కనీస వేతనం ₹30 వేలకు పెంచాలి BMS ఆధ్వర్యంలో ఖమ్మంలో ధర్నా.. గోరెంట్ల నారాయణ డిమాండ్
- ఖమ్మం

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. కనీస వేతనం ₹30 వేలకు పెంచాలి BMS ఆధ్వర్యంలో ఖమ్మంలో ధర్నా.. గోరెంట్ల నారాయణ డిమాండ్

ఖమ్మం: కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ BMS ఖమ్మం జిల్లా అధ్యక్షులు గోరెంట్ల నారాయణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ కార్మికుల కనీస వేతనాన్ని నెలకు రూ.30 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ESIC వేతన పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.21 వేల నుంచి రూ.42 వేలకు పెంచాలని, కనీస EPC పెన్షన్‌ను రూ.7,500తో పాటు కరువు భత్యం, వైద్య పథకంతో కల్పించాలని కోరారు. అలాగే బ్యాంకింగ్ రంగంలో వారానికి ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో BMS జిల్లా ఉపాధ్యక్షులు తొడుపునూరి రవీందర్, రాయల సీతయ్య, తోట పున్నారావు, శ్రీలత, జిల్లా సెక్రటరీ యార్లగడ్డ రాఘవరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ దగ్గు మాటి వేణుగోపాల్ రావు, జాయింట్ సెక్రటరీలు కామని వెంకటేశ్వర రావు, మిక్కిలినేని సునీల్, గుంటి గౌతమ్, పోతగాని రంజిత్ కుమార్, కోశాధికారి కోయినేని ప్రదీప్, కార్యవర్గ సభ్యులు బోడ కృష్ణ, నున్న వినోద్, మరికంటి సంతోష్, మాధవి, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం: కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ BMS ఖమ్మం జిల్లా అధ్యక్షులు గోరెంట్ల నారాయణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ కార్మికుల కనీస వేతనాన్ని నెలకు రూ.30 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ESIC వేతన పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.21 వేల నుంచి రూ.42 వేలకు పెంచాలని, కనీస EPC పెన్షన్‌ను రూ.7,500తో పాటు కరువు భత్యం, వైద్య పథకంతో కల్పించాలని కోరారు. అలాగే బ్యాంకింగ్ రంగంలో వారానికి ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో BMS జిల్లా ఉపాధ్యక్షులు తొడుపునూరి రవీందర్, రాయల సీతయ్య, తోట పున్నారావు, శ్రీలత, జిల్లా సెక్రటరీ యార్లగడ్డ రాఘవరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ దగ్గు మాటి వేణుగోపాల్ రావు, జాయింట్ సెక్రటరీలు కామని వెంకటేశ్వర రావు, మిక్కిలినేని సునీల్, గుంటి గౌతమ్, పోతగాని రంజిత్ కుమార్, కోశాధికారి కోయినేని ప్రదీప్, కార్యవర్గ సభ్యులు బోడ కృష్ణ, నున్న వినోద్, మరికంటి సంతోష్, మాధవి, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.