Thursday, 3 September 2026
  • Home  
  • ఎన్నికలకు సిద్ధం కావాలి.. ఐక్యంగా పనిచేయాలి: జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ లావణ్య కుమార్ గారు
- తిరుపతి

ఎన్నికలకు సిద్ధం కావాలి.. ఐక్యంగా పనిచేయాలి: జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ లావణ్య కుమార్ గారు

పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో జనసేన జోష్ బుచ్చినాయుడుకండ్రిగ, సెప్టెంబర్ 2 డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుచ్చినాయుడుకండ్రిగలో జనసేన నాయకుడు మండల అధ్యక్షుడు జే భాషా రాయల్ గారు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్, అన్నదానం చేసి పవన్ కళ్యాణ్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని జై జనసేన.. జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొప్పల లావణ్యకుమార్ గారు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత విభేదాలు, అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, ఎన్నికల్లో సమష్టి కృషితో పార్టీని మరింత బలోపేతం చేయాలని కొప్పల లావణ్య కుమార్ పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు జె.భాషా రాయల్ ఉపాధ్యక్షుడు భాస్కర్ మరియు కార్యకర్తలు ఢిల్లీబాబు, బాలాజీ, హరిబాబు, వేలు, సుందర్ రాయల్,శంకరయ్య, చెంగయ్య, దామ చంద్రశేఖర్ తదితరు నాయకులు పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో జనసేన జోష్

బుచ్చినాయుడుకండ్రిగ, సెప్టెంబర్ 2
డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుచ్చినాయుడుకండ్రిగలో జనసేన నాయకుడు మండల అధ్యక్షుడు జే భాషా రాయల్ గారు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్, అన్నదానం చేసి పవన్ కళ్యాణ్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని జై జనసేన.. జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలతో సందడి చేశారు.

ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొప్పల లావణ్యకుమార్ గారు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత విభేదాలు, అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు.

గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, ఎన్నికల్లో సమష్టి కృషితో పార్టీని మరింత బలోపేతం చేయాలని కొప్పల లావణ్య కుమార్ పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు జె.భాషా రాయల్ ఉపాధ్యక్షుడు భాస్కర్ మరియు కార్యకర్తలు ఢిల్లీబాబు, బాలాజీ, హరిబాబు, వేలు, సుందర్ రాయల్,శంకరయ్య, చెంగయ్య, దామ చంద్రశేఖర్ తదితరు నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.