నందవరం: మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, ఎమ్మిగనూరు శాసనసభ్యులు డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి గారి మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న 45 రోజుల “ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా నందవరం మండలం పెద్ద కొత్తలి గ్రామంలోని బూత్ నం.05, క్లస్టర్–1 పరిధిలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ పర్యటించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు, అవసరాలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, దీపం–2, అన్న క్యాంటీన్లు, రైతుల సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి–ఉద్యోగ అవకాశాలు తదితర సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు.
అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండు సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలను గ్రామస్తులకు వివరించారు. “ఇంటింటా తెలుగుదేశం” కరపత్రాలను ప్రతి ఇంటికీ అందజేస్తూ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
“ప్రతి ఇంటికి సంక్షేమం – ప్రతి కుటుంబానికి అభివృద్ధి – ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం” అనే లక్ష్యంతో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం కొనసాగుతోంది.



