తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండ లోకనాథం ఇళ్లపై ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. సీబీఐ అందించిన సమాచారంతో తిరుపతిలోని ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో రూ.31.98 లక్షల విలువైన ఆస్తి పత్రాలు, 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12.5 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మొత్తం సుమారు రూ.5 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆస్తుల వివరాలు, ఆదాయ వనరులపై ఏసీబీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

TTD డిప్యూటీ ఈవో ఇంట్లో రూ.5 కోట్ల అక్రమాస్తులు!