Sunday, 27 September 2026

Tag: విశాఖపట్నం పున్నమి న్యూస్

విశాఖపట్నం

విశాఖకు మంత్రి నారా లోకేష్ రాక – స్వాగతం పలికిన డీసీసీబీ చైర్మన్ కొణతాతారావు

*విశాఖపట్నం, ఆగస్టు 27:* రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం రాత్రి విశాఖ విచ్చేశారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యేందుకు భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మంత్రికి డీసీసీబీ చైర్మన్ కొణతాతారావు తో పాటు ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు గణబాబు, విష్ణుకుమార్ రాజు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వివాహ వేడుకలో డీసీసీబీ చైర్మన్ కొణతాతారావు మంత్రి లోకేష్ తో కలిసి పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రితో కలిసి దిగిన ఫోటోలో డీసీసీబీ చైర్మన్ కొణతాతారావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

విశాఖపట్నం

ఏపీఈపీడీసీఎల్ అధికారులు కూటమి ప్రభుత్వాన్ని కూల్చేసేలా ఉన్నారు

_వైసిపి పార్టీ కార్యకర్తలుగా ప్రవర్తిస్తున్న కొంతమంది ఏఈలు, లైన్ మెన్లు స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఏసిడి, ఎల్ టి పేరుతో వినియోగదారులకు వేధింపులు _గత ఎన్నికల ముందు ఇదే తీరు వలన వైసీపీ ఓటమికి కారణమైన అధికారులు_ ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా ప్రజల మన్ననలు పొందాలంటే ఆ ప్రభుత్వములో పనిచేసే వివిధ శాఖలోని అధికారుల పనితీరు బట్టి ఆధారపడి ఉంటుంది. ఆర్ఇసిఎస్ గా చాలాకాలం ఉండి నూతనంగా ఏపీ ఈపీడీసీఎల్ లోకి విలీనమైన లంకెలపాలెం సెక్షన్ కార్యాలయం అధికారుల తీరు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది. ఈ సెక్షన్ పరిధిలో చాలా వీధుల్లో నాణ్యమైన కరెంటు రావడం లేదంటూ ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు ఏ సి డి(అడిషనల్ కన్జ్యూమర్ డిపాజిట్) సొమ్ము అని ఒకసారి, లోడ్ చేంజ్ పేరుతో మరొకసారి విద్యుత్ వినియోగదారులపై భారం మోపుతున్నారు. కనీసం వాటి పై విరియోగదారులకు ఎటువంటి అవగాహన కల్పించకుండా వారిని ఈ సొమ్ము చెల్లించాలంటూ వేధిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కొంతమంది తప్పక అప్పులు చేసి మరి ఈ సొమ్మును చెల్లిస్తున్నారు. ఇదే రకంగా విద్యుత్ శాఖ అధికారుల తీరు ఉంటే ప్రజలకు వివిధ పథకాల ద్వారా మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పని కొంతమంది ప్రజలు హెచ్చరిస్తున్నారు.

విశాఖపట్నం

అనకాపల్లిలో సంచార జాతుల విముక్తి దినోత్సవం – మడక పార్వతి రమేష్ కు ఆహ్వానం

Pబీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 31న అనకాపల్లిలో నిర్వహించనున్న సంచార, అర్ధ సంచార విముక్త జాతుల విముక్తి దినోత్సవానికి పరవాడ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు మడక పార్వతి రమేష్ కు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలో సంచార జాతులను గుర్తించి వారికి గౌరవం కల్పిస్తున్న ఏకైక పార్టీ బీజేపీయే అన్నారు. సంచార జాతులకు స్థిర నివాసం, విద్యా అవకాశాలు కల్పించి వారి కలలకు గుర్తింపు తేవాలని కోరారు. ఈ నెల 31న సోమవారం అనకాపల్లి రావు గోపాలరావు కళాక్షేత్రంలో “సంచార జాతులు – స్ఫూర్తి, సంస్కృతి వారసులు” పేరుతో జరిగే ఈ కార్యక్రమానికి వివిధ సంచార జాతుల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర పెద్దలు, మంత్రులు, స్థానిక ఎంపీ సీఎం రమేష్ పాల్గొననున్నారు.

విశాఖపట్నం

వార్డు 87లో పారిశుధ్య కార్మికులకు సబ్బులు, నూనె పంపిణీ

గాజువాక: 87వ వార్డు పరిధిలో పారిశుధ్య కార్మికులకు వార్షిక ప్రయోజన కార్యక్రమం కింద సబ్బులు, కొబ్బరి నూనె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోనల్ కమిషనర్ బి. శేషాద్రి మాజీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం (జగన్) పాల్గొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న కార్మికుల సంక్షేమం, ఆరోగ్యం కోసమే ఈ సామగ్రిని అందిస్తున్నట్లు వారు తెలిపారు. విధులతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు, శిరసపల్లి అప్పలరాజు, కనక సత్యం, సుందర్ సునీల్, శానిటరీ సూపర్‌వైజర్ ఎం. కోటేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ బి. అనిల్ కుమార్, వార్డు శానిటేషన్ సెక్రటరీలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

విశాఖ స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ అమలు చేయాలి – PF కమిషనర్ కు వినతి

*విశాఖపట్నం, ఆగస్టు 25:* విశాఖ స్టీల్ ప్లాంట్ లో రిటైర్ అయిన 1100 మంది ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ వర్తింపజేయాలని కోరుతూ PF కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు విశాఖ ప్రాంతీయ PF కమిషనర్ శ్రీ అమర్ దీప్ మిశ్రా గారిని కలిసి APCC అధికార ప్రతినిధి, AP రాష్ట్ర INTUC ఉపాధ్యక్షులు *జెర్రిపోతుల ముత్యాలు* ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఈ వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు N. రామారావు, కణితి అప్పలరాజు, హుస్సేన్, Ch. అప్పలస్వామి, మంత్రి గోపీ, బొడ్డు కృష్ణ, సియ్యాద్రి తులసిబాబు, పప్పల నరసింగరావు, నాయుడు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు

ఉదయం కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, దేవాదాయ శాఖ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్టేట్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి తెలుగు లక్ష్మి ఎర్నిమాంబ అమ్మవారి ఆలయంలో మొక్కులు చెల్లించుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ని ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా సీనియర్ నాయకుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం మానవీయ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్ రాజు, మాజీ డిప్యూటీ మేయర్ గోవింద్ రెడ్డి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

32 ఏళ్ల తర్వాత మళ్లీ బడి గూటికి… 1994 బ్యాచ్ అపూర్వ కలయిక!

శ్రీహరిపురంలోని VT కాలేజ్ స్కూల్ లో 1994లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 32 సంవత్సరాల తర్వాత ఆత్మీయంగా కలుసుకున్నారు. నాటి చిన్ననాటి స్నేహితులందరినీ ఒక్కసారి కలవాలనే చిరకాల కోరిక ఎట్టకేలకు నేడు నెరవేరింది. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం ఒకప్పుడు ఎక్కడికెక్కడికో వెళ్లిపోయిన వారంతా, ఈ వేడుక కోసం కుటుంబ సమేతంగా తరలివచ్చారు. అమెరికా, దుబాయ్ వంటి దేశాల్లో NRI లుగా స్థిరపడిన వారు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా ఈ కలయికలో పాల్గొనడం విశేషం. పాత స్కూల్ జ్ఞాపకాలు, స్నేహితులతో చేసిన అల్లరి, గురువుల ఆప్యాయతను గుర్తుచేసుకుంటూ అందరూ భావోద్వేగానికి గురయ్యారు. చిన్ననాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, ఒకరినొకరు పలకరించుకుంటూ ఆనందంలో మునిగిపోయారు. ఎన్ని ఏళ్లు గడిచినా తమ స్నేహబంధం చెక్కుచెదరలేదని నిరూపించిన ఈ కలయిక అందరికీ మధురానుభూతిని మిగిల్చింది

విశాఖపట్నం

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మర్చిపోవద్దు

ఇటీవల మా Frnd వాళ్ళ నాన్నగారు అనారోగ్యానికి గురై హాస్పిటల్‌లో చేరిన సమయంలో, దాదాపు 3–4 రోజులు అక్కడే పరిస్థితులను దగ్గరగా గమనించే అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది — *అనారోగ్యం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ హాస్పిటల్ ఖర్చులు మాత్రం కుటుంబంపై ఒక్కసారిగా భారీ భారం అవుతాయి.* అందుకే ప్రతి ఒక్కరికీ నా చిన్న విజ్ఞప్తి 🙏 *అవసరమైతే అప్పు చేసినా సరే, మీ కుటుంబానికి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి.* *మన కోసం మాత్రమే కాదు… మన కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం కూడా ఇది చాలా ముఖ్యమైన ఆర్థిక రక్షణ.* *ఆరోగ్యం ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి.* *ఆరోగ్యం పాడయ్యాక మనకి ఇన్సూరెన్స్ కావాలన్నా ఇవ్వరు అలోచించి నిర్ణయం తీసుకోండి

విశాఖపట్నం

విశాఖ ఉక్కు నుంచి సీఐఎస్ఎఫ్ ఉపసంహరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి – DSEU

విశాఖపట్నం: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఉపసంహరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ బొండా యల్లాజీరావు డిమాండ్ చేశారు. యాజమాన్యం, ప్రభుత్వం ముప్పేట దాడి చేస్తున్నా, భద్రత, స్పేర్ పార్ట్స్ లేకపోయినా, జీతాల్లో కోతలు విధిస్తున్నా కార్మికులు ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నారన్నారు. సీఐఎస్ఎఫ్ ఉన్నప్పుడే దొంగతనాలు జరుగుతుంటే, ప్రైవేట్ సెక్యూరిటీ వస్తే దోపిడీ మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

విశాఖపట్నం

నరవ గ్రామంలో జనసేన ఆత్మీయ సమావేశం

విశాఖ: 88వ వార్డు నరవ గ్రామంలో జనసేన ఆత్మీయ సమావేశం వార్డు అధ్యక్షులు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగింది. వీర మహిళలు జనసేన లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఏడు సిద్ధాంతాలతో పార్టీని స్థాపించారని, ఎన్డీఏ కూటమితో రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆదేశాలతో గ్రామ బాధ్యతలు లింగం శ్రీనివాసరావుకు అప్పగించారు. గ్రామంలో కల్యాణ మండపం, రోడ్లు, 10 పడకల ఆసుపత్రి, బీసీ గురుకుల భవనం వంటి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో 200 మంది జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.