Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: కోగిలి. దామరపు.హరికృష్ణ

తిరుపతి

*గుణపాడు గిరిజన కాలనీలో ఉచిత నేత్ర వైద్య శిబిరం,*}{గుణపాడు}{*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగష్టు 25 చిట్టమూరు మండలం,*}

*గుణపాడు గిరిజన కాలనీలో ఉచిత నేత్ర వైద్య శిబిరం,* (గుణ పాడు) *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగష్టు 25 చిట్టమూరు మండలం,* గుణపాడు గిరిజన కాలనీలో మంగళవారం ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ గుణపాడు గిరిజన కాలనీలోని అన్ని కుటుంబాల వారికి కోట పట్టణానికి చెందిన రమేష్ ఐ కేర్ నేతృత్వంలో కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించారు. ఎం వి రావు ఫౌండేషన్ ద్వారా నిర్వహించే ఈ ఉచిత వైద్య శిబిరంలో గిరిజన కాలనీలోని ప్రతి ఒక్కరికి దృష్టిలోపాన్ని అరికట్టేందుకు ఈ నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి దృష్టి సమస్యలు కంటిలో శుక్లాలు ఉన్నవారిని గుర్తించి కంటి అద్దాలు అవసరమైన వారికి కంటి అద్దాలు, కంటిలో శుక్లాలు ఉన్న వారికి తిరుపతి వాసన ఐ కేర్ కంటి ఆసుపత్రి నందు ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు. స్థానిక అంగనవాడి కేంద్రంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి గిరిజన కాలనీవాసులు అత్యధికంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, అంగన్వాడి సిబ్బంది కవిత పాల్గొన్నారు.గిరిజన కాలనీవాసులు పాల్గొని కంటి సమస్యలకు అవసరమైన చికిత్సలు చేయించుకున్నారు.

తిరుపతి

రెండో విడత జ్ఞాన జ్యోతి శిక్షణ ట్రైనింగ్ కార్యక్రమం,*

*అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ,* *ఆరోగ్యంపై అవగాహన,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 24 చిట్టమూరు మండలం,* చిట్టమూరు: కోట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని జీఎంఎన్ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు రెండో విడత జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండో రోజు జరిగిన శిక్షణలో చిన్నారుల ఆరోగ్యం, పోషణ, మెదడు అభివృద్ధి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ మునికుమారి, భాస్కర్, వేణు పాల్గొని శిక్షణను నిర్వహించారు. చిన్నారులు ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమైన పోషకాహారం, పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ అంశాలను అంగన్వాడీ కార్యకర్తలకు వివరించారు. ముఖ్యంగా చిన్నారుల జీవితంలో తొలి 1000 రోజులు అత్యంత కీలకమైనవని, ఈ కాలంలో మెదడు అభివృద్ధి గణనీయంగా జరుగుతుందని భాస్కర్ వివరించారు. పిల్లలకు అవసరమైన పోషకాలు, పాలు, పెరుగు తదితర పోషకాహార పదార్థాల ప్రాధాన్యతను వివరించారు. తల్లి, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా పోషకాహార లోపాలను తగ్గించవచ్చని సూచించారు. సీడీపీఓ మునికుమారి మాట్లాడుతూ వివిధ రుగ్మతలను గుర్తించడం, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, చిన్నారులకు అందాల్సిన సేవలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా కల్పించే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను అంగన్వాడీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జ్ఞాన జ్యోతి శిక్షణ ద్వారా చిన్నారుల ఆరోగ్యం, పోషణపై తమకు మరింత అవగాహన కలిగిందని కార్యకర్తలు తెలిపారు.

తిరుపతి

*పేరంటాలమిట్ట అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం,* } {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగష్టు 24 చిట్టమూరు మండలం,* }

*పేరంటాలమిట్ట అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగష్టు 24 చిట్టమూరు మండలం,* కోగిలి: పేరంటాల మిట్ట ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని 276వ బూత్‌ కన్వీనర్‌ తీపలపూడి ఉదయ్‌, కో-కన్వీనర్‌ తీపలపూడి రవి అన్నారు. కోగిలి పంచాయతీ టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ రషీద్‌ భాయ్‌ సహకారంతో పేరంటాల మిట్ట గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వారు తెలిపారు. గత మూడు దశాబ్దాలుగా పేరంటాల మిట్ట ప్రాంతాన్ని పలువురు నాయకులు పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.5 లక్షల మేర నిధుల సహకారం అందడంతో ప్రజలకు రాకపోకల సౌకర్యం మెరుగుపడిందన్నారు. అదేవిధంగా కొత్తగా రోడ్లకు ఇరువైపులా విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేసి, లైన్లను క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. స్థానిక ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మంచినీటి సదుపాయం కూడా కల్పించినట్లు చెప్పారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదని తీపలపూడి ఉదయ్‌, తీపలపూడి రవి అన్నారు. ప్రజల సంక్షేమం కోసం జరుగుతున్న మంచి పనులను హేళన చేస్తే టీడీపీ శ్రేణులు, ప్రజలు సహించబోరని హెచ్చరించారు. 276వ బూత్‌ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని వారు తెలిపారు. పేరంటాల మిట్టలో మిగిలిన మౌలిక వసతుల అభివృద్ధికి కూడా తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తీపలపూడి ఉదయ్‌, తీపలపూడి రవి పేర్కొన్నారు.

తిరుపతి

*భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలు విజయవంతం,* *ఏనుగుపై స్వామివారి ఘన దర్శనం.. గ్రామోత్సవంలో పోటెత్తిన భక్తజనం,* }{ *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగష్టు 24 చిట్టమూరు మండలం,* }

*భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలు విజయవంతం,* *ఏనుగుపై స్వామివారి ఘన దర్శనం.. గ్రామోత్సవంలో పోటెత్తిన భక్తజనం,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగష్టు 24 చిట్టమూరు మండలం,* చిట్టమూరు మండలం ఆరూరు గ్రామపంచాయతీ పరిధిలోని తంబుగారిపాలెం గ్రామంలో కొలువుదీరిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా ముగిశాయి. ఏడు రోజుల పాటు నిర్వహించిన ఈ మహోత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం విశేషంగా నిలిచింది. తంబుగారిపాలెంలో గత ఏడు సంవత్సరాలుగా అఖండ జ్యోతి వెలుగుతూ భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలను ఆలయ పూజారి సురేష్ స్వామి, ధర్మకర్త ముక్కు సుబ్బరాజు, సలహాదారు శాంతారామ్, కమిటీ సభ్యులు సుధాకర్‌రెడ్డి, మునిశంకర్, చిట్టమూరు మండలం ప్రభ రిపోర్టర్ వెంకీ, లైటింగ్ గోవిందయ్య, భజన గురువు దశయ్య తదితరులు భక్తుల సహకారంతో నిర్వహించారు. ఏడు రోజుల పాటు వైభవంగా వాహన సేవలు మొదటి రోజు మంగళవారం హనుమంతుని వాహన సేవ, భజన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. రెండో రోజు బుధవారం పులి వాహన సేవతో పాటు పాటకచేరి నిర్వహించారు. మూడో రోజు గురువారం గరుడ వాహన సేవ, నాలుగో రోజు శుక్రవారం సర్వభూపాల వాహన సేవ, పండరి భజనలు ఘనంగా జరిగాయి. ఐదో రోజు శనివారం చంద్రప్రభ వాహన సేవ, భజనలు నిర్వహించగా, ఆరో రోజు ఆదివారం రథోత్సవం, కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆయా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఏనుగుపై స్వామివారి ఊరేగింపు ఏడో రోజు సోమవారం స్వామివారి సజీవ సమాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని గజ వాహన సేవ నిర్వహించారు. పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఏనుగుపై శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించడంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భజనలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గజ వాహన సేవకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలిరావడంతో తంబుగారిపాలెం సందడిగా మారింది. భక్తులకు అన్నదానం గజ వాహన సేవ, గ్రామోత్సవం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. అనంతరం మారుబోయినా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నదానంలో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఏడు రోజుల పాటు నిర్వహించిన వాహన సేవలు, భజనలు, రథోత్సవానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. అఖండ జ్యోతి వెలుగుతున్న ఈ క్షేత్రంలో ప్రతి ఏడాది భక్తుల సంఖ్య పెరుగుతోందని, ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ భక్తుల సహకారంతో ఆరాధన మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. వాహన సేవలు, భజనలు, రథోత్సవం, గజ వాహన సేవ, గ్రామోత్సవం, అన్నదానం తదితర కార్యక్రమాలతో ఏడు రోజుల పాటు తంబుగారిపాలెం గ్రామం ఆధ్యాత్మిక సందడితో కళకళలాడింది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలు భక్తుల హృదయాల్లో భక్తిభావాన్ని నింపుతూ విజయవంతంగా ముగిశాయి.

తిరుపతి

*భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలు విజయవంతం,* *ఏనుగుపై స్వామివారి ఘన దర్శనం.. గ్రామోత్సవంలో పోటెత్తిన భక్తజనం,* } {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగష్టు 24 చిట్టమూరు మండలం,* }

*భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలు విజయవంతం,* *ఏనుగుపై స్వామివారి ఘన దర్శనం.. గ్రామోత్సవంలో పోటెత్తిన భక్తజనం,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగష్టు 24 చిట్టమూరు మండలం,* చిట్టమూరు మండలం ఆరూరు గ్రామపంచాయతీ పరిధిలోని తంబుగారిపాలెం గ్రామంలో కొలువుదీరిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా ముగిశాయి. ఏడు రోజుల పాటు నిర్వహించిన ఈ మహోత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం విశేషంగా నిలిచింది. తంబుగారిపాలెంలో గత ఏడు సంవత్సరాలుగా అఖండ జ్యోతి వెలుగుతూ భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలను ఆలయ పూజారి సురేష్ స్వామి, ధర్మకర్త ముక్కు సుబ్బరాజు, సలహాదారు శాంతారామ్, కమిటీ సభ్యులు సుధాకర్‌రెడ్డి, మునిశంకర్, చిట్టమూరు మండలం ప్రభ రిపోర్టర్ వెంకీ, లైటింగ్ గోవిందయ్య, భజన గురువు దశయ్య తదితరులు భక్తుల సహకారంతో నిర్వహించారు. ఏడు రోజుల పాటు వైభవంగా వాహన సేవలు మొదటి రోజు మంగళవారం హనుమంతుని వాహన సేవ, భజన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. రెండో రోజు బుధవారం పులి వాహన సేవతో పాటు పాటకచేరి నిర్వహించారు. మూడో రోజు గురువారం గరుడ వాహన సేవ, నాలుగో రోజు శుక్రవారం సర్వభూపాల వాహన సేవ, పండరి భజనలు ఘనంగా జరిగాయి. ఐదో రోజు శనివారం చంద్రప్రభ వాహన సేవ, భజనలు నిర్వహించగా, ఆరో రోజు ఆదివారం రథోత్సవం, కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆయా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఏనుగుపై స్వామివారి ఊరేగింపు ఏడో రోజు సోమవారం స్వామివారి సజీవ సమాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని గజ వాహన సేవ నిర్వహించారు. పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఏనుగుపై శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించడంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భజనలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గజ వాహన సేవకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలిరావడంతో తంబుగారిపాలెం సందడిగా మారింది. భక్తులకు అన్నదానం గజ వాహన సేవ, గ్రామోత్సవం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. అనంతరం మారుబోయినా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నదానంలో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఏడు రోజుల పాటు నిర్వహించిన వాహన సేవలు, భజనలు, రథోత్సవానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. అఖండ జ్యోతి వెలుగుతున్న ఈ క్షేత్రంలో ప్రతి ఏడాది భక్తుల సంఖ్య పెరుగుతోందని, ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ భక్తుల సహకారంతో ఆరాధన మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. వాహన సేవలు, భజనలు, రథోత్సవం, గజ వాహన సేవ, గ్రామోత్సవం, అన్నదానం తదితర కార్యక్రమాలతో ఏడు రోజుల పాటు తంబుగారిపాలెం గ్రామం ఆధ్యాత్మిక సందడితో కళకళలాడింది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలు భక్తుల హృదయాల్లో భక్తిభావాన్ని నింపుతూ విజయవంతంగా ముగిశాయి.

తిరుపతి

*స్వచ్ఛ పంచాయతీ కార్యక్రమంలో చెత్త బుట్టల పంపిణీ,*} {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్ట్ 23 వాకాడు మండలం,* }

*స్వచ్ఛ పంచాయతీ కార్యక్రమంలో చెత్త బుట్టల పంపిణీ,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్ట్ 23 వాకాడు మండలం,* కల్లూరు: స్వచ్ఛ పంచాయతీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కల్లూరు పంచాయతీ పరిధిలోని కోడివాక గ్రామంలో చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ కల్లూరు పంచాయతీ ఇన్‌చార్జి జనార్ధన రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రతి ఇంటి వద్ద చెత్త బుట్టలను వినియోగించాలని ప్రజలకు సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్వచ్ఛ పంచాయతీ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు చర్యలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

తిరుపతి

*రక్తదానం చేయండి ఆపదలో ఉన్న వారిని రక్షించండి.* *శ్రీ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.*} {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 23 కోట మండలం,* }

*రక్తదానం చేయండి ఆపదలో ఉన్న వారిని రక్షించండి.* *శ్రీ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 23 కోట మండలం,* రక్తదానం చేయండి ఆపదలో ఉన్న మరోకరిని రక్షించండి ఇదే మన నినాదం అదేవిధంగా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కోరారు. ఆదివారం కోట మండలం చెందోడు గ్రామంలోని శ్రీ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణలో విద్యా ప్రదాత ముప్పవరపు వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి గార్ల పేరిట ఏర్పాటు అయిన ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్.బి.కె.ఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల మాజీ కరస్పాండెంట్ శ్రీ ఖాన్ నజిరుద్దీన్ ఖాన్ స్మృతికి చిహ్నంగా, స్వర్గీయ శ్రీ ముప్పవరపు వెంకటేశ్వరరావు ఆత్మీయులుగా ఖాన్ మంచి స్నేహితులని ఇలాంటి సమయంలో ఖాన్ సార్ మృతి చెందడం బాధాకరమని వారి ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ముందుగా ముప్పవరపు వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి చిత్రపటాలకు పూలమాలవేసి జ్యోతి ప్రజలవన చేశారు. తదుపరి రక్తదాతల నుంచి నెల్లూరు పట్టణానికి చెందిన నోవా బ్లడ్ బ్యాంకు వారు రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో నోవా బ్లడ్ బ్యాంకు వారు రక్తదాతలకు ప్రశంసా పత్రము బహుమతి అందజేశారు. ఈ రక్తదాన సినిమాలో 25 మంది రక్తదాతల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి శ్రీ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల పి ఈ టి రక్తదాతలు పాల్గొన్నారు.

తిరుపతి

*విత్తన గుళికలతో పంటలకు రక్షణ..* * *ఎన్పీఎం డీపీఎం కన్నయ్య* } {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 22 కోట మండలం,* }

*విత్తన గుళికలతో పంటలకు రక్షణ..* * *ఎన్పీఎం డీపీఎం కన్నయ్య* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 22 కోట మండలం,* *విత్తనాలను గుళికలుగా మార్చి చల్లడం వల్ల విత్తనాలకు చీమలు, పక్షుల నుంచి రక్షణ కల్పించవచ్చని ఎన్పీఎం డీపీఎం కన్నయ్య తెలిపారు. వర్షం కురిసినప్పుడు విత్తన గుళికల్లోని విత్తనాలు మొలకెత్తేలా చేయడంతో పాటు విత్తనాలు చెడిపోకుండా సంరక్షించడమే ఈ విధానం ఉద్దేశమని తెలిపారు. కోట మండలం చంద్రశేఖరపురం గ్రామంలో డీపీఎం ఆధ్వర్యంలో తొమ్మిది రకాల విత్తనాలను గుళికలుగా మార్చి పొలంలో చల్లారు. సాధారణంగా విత్తనాలను నేరుగా పొలంలో చల్లినప్పుడు చీమలు, పక్షులు వాటిని తినే అవకాశం ఉంటుందని, విత్తనాలను గుళికలుగా మార్చి చల్లడం వల్ల వాటికి రక్షణ లభిస్తుందని వివరించారు. వర్షం పడిన సమయంలో గుళికలకు తేమ అందడంతో విత్తనాలు మొలకెత్తుతాయని తెలిపారు. విత్తన సంరక్షణతో పాటు ప్రకృతి ఆధారిత సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎంటీ శ్రీనివాసులు, తిరుమల ఐసీఆర్‌పీలు ఎన్.భాగ్యలక్ష్మి, శివకుమారి, సౌజన్య, మల్లీశ్వరి, కావేరి, మునికుమారి, నీలిమ, సౌందర్య, గౌతమి పాల్గొన్నారు. స్థానిక రైతులు సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు.*

తిరుపతి

*ప్లాస్టిక్ వినియోగంతో ముప్పు.* *చిట్టమూరు మండలంలోని గ్రామాల్లో ఎం.వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రచారం,* *గుడ్డ సంచులు పంపిణీ.*} {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 22 చిట్టమూరు మండలం,* }

*ప్లాస్టిక్ వినియోగంతో ముప్పు.* *చిట్టమూరు మండలంలోని గ్రామాల్లో ఎం.వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రచారం,* *గుడ్డ సంచులు పంపిణీ.* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 22 చిట్టమూరు మండలం,* కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన విద్యా ప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు, ఆదిలక్ష్మి దంపతులకు చెందినకుటుంబ సభ్యులు ఎం.వి.రావు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్లాస్టిక్ వినియోగం వద్దంటూ చిట్టమూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్లాస్టిక్ వినియోగం వద్దంటూ తద్వారా పర్యావరణం నకు ఉప్పు వాటిల్లుతుందని ప్లాస్టిక్ సమాజారహితమే తమ ఫౌండేషన్ ధ్యేయం స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు సోదరులు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ముప్పవరపు హరి ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు. ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కుటుంబీకులు పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ సంచులకు ప్రత్యానమయంగా గుడ్డ సంచులను వాడాలని సూచించారు. వారికి గుడ్డ సంచలను పంపిణీ చేశారు. పర్యావరణకు ముప్పు వాటిల్లకుండా కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడు పై ఉందని వారు సూచించారు. ప్లాస్టిక్ సంచు లను వినియోగిస్తూ ఉంటే రాబోవు కాలంలో మానవ మనుగడకు ప్రమాదం ఉందన్నారు. స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి కుటుంబానికి చెందిన గుంటూరు తెనాలి ప్రాంత వాసులు మాయా ప్రాంతాలలో కూడా ఎం వి రావు ఫౌండేషన్ చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతుగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు కృషి చేస్తామని ముప్పు వరకు హరి ప్రసాదరావు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి, ముప్పవరపు హరి ప్రసాదరావు, ముప్పవరపు నాగేశ్వరరావు, ముప్పవరపు చంద్రశేఖర్ బాబు వారి కుటుంబ సభ్యులు ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

*జ్ఞాన జ్యోతి రెండో విడత శిక్షణ,* } {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 22 చిట్టమూరు మండలం,*}

*జ్ఞాన జ్యోతి రెండో విడత శిక్షణ,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 22 చిట్టమూరు మండలం,* అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం, చిట్టమూరు :- కోట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని చిట్టమూరు జిఎంఎన్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, బాలల రక్షణ, హక్కులు, సామాజిక సమస్యలపై అంగన్వాడీ కార్యకర్తలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మిషన్ శక్తి కోఆర్డినేటర్ కృష్ణ మంజరి, ఓఎస్సీ అడ్మిన్ సుజాత, ఓఎస్సీ నగ్మా, సీడీపీఓ మునికుమారి, సూపర్‌వైజర్ కవిత, భాస్కర్, వేణు తదితరులు పాల్గొని శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్య వివాహాలపై అవగాహన మిషన్ శక్తి కోఆర్డినేటర్ కృష్ణ మంజరి మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల బాలికల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టడంలో అంగన్వాడీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. తమ పరిధిలో బాల్య వివాహానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి, బాలల రక్షణకు చర్యలు తీసుకునేలా సహకరించాలని కోరారు. అలాగే వెట్టి చాకిరీ, మహిళలు మరియు బాలికలపై లైంగిక వేధింపులు, హింసకు గురయ్యే వారి రక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. బాధితులకు భద్రత కల్పించడం, వారికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవలు మరియు సహాయ వ్యవస్థలను వినియోగించుకోవడం వంటి అంశాలను వివరించారు. 1098 సేవలపై ప్రత్యేక అవగాహన బాలల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉన్న చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 సేవల గురించి కూడా అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్న లేదా రక్షణ అవసరమైన పిల్లలకు తగిన సహాయం అందేలా సంబంధిత వ్యవస్థలకు సమాచారం చేరవేయడంలో అంగన్వాడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమాజంలో అంగన్వాడీల పాత్ర కీలకం బాలల సంరక్షణ, మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ వంటి సామాజిక అంశాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించడంలో అంగన్వాడీ కార్యకర్తల పాత్ర ఎంతో ముఖ్యమని కార్యక్రమంలో పేర్కొన్నారు. శిక్షణలో పొందిన విషయాలను తమ పరిధిలోని కుటుంబాలకు చేరవేసి, అవసరమైన సందర్భాల్లో సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని చిట్టమూరు మండలానికి చెందిన పలువురు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. బాలల హక్కులు, మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణపై మరింత అవగాహన పెంచేందుకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.