*ప్లాస్టిక్ వినియోగంతో ముప్పు.*
*చిట్టమూరు మండలంలోని గ్రామాల్లో ఎం.వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రచారం,*
*గుడ్డ సంచులు పంపిణీ.*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 22 చిట్టమూరు మండలం,*
కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన విద్యా ప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు, ఆదిలక్ష్మి దంపతులకు చెందినకుటుంబ సభ్యులు ఎం.వి.రావు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్లాస్టిక్ వినియోగం వద్దంటూ చిట్టమూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు ప్లాస్టిక్ వినియోగం వద్దంటూ తద్వారా పర్యావరణం నకు ఉప్పు వాటిల్లుతుందని ప్లాస్టిక్ సమాజారహితమే తమ ఫౌండేషన్ ధ్యేయం స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు సోదరులు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ముప్పవరపు హరి ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు. ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కుటుంబీకులు పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ సంచులకు ప్రత్యానమయంగా గుడ్డ సంచులను వాడాలని సూచించారు.
వారికి గుడ్డ సంచలను పంపిణీ చేశారు. పర్యావరణకు ముప్పు వాటిల్లకుండా కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడు పై ఉందని వారు సూచించారు.
ప్లాస్టిక్ సంచు లను వినియోగిస్తూ ఉంటే రాబోవు కాలంలో మానవ మనుగడకు ప్రమాదం ఉందన్నారు.
స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి కుటుంబానికి చెందిన గుంటూరు తెనాలి ప్రాంత వాసులు మాయా ప్రాంతాలలో కూడా ఎం వి రావు ఫౌండేషన్ చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతుగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు కృషి చేస్తామని ముప్పు వరకు హరి ప్రసాదరావు తెలిపారు
ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి,
ముప్పవరపు హరి ప్రసాదరావు, ముప్పవరపు నాగేశ్వరరావు, ముప్పవరపు చంద్రశేఖర్ బాబు వారి కుటుంబ సభ్యులు ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు



