ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉన్నత పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని డైట్ కళాశాల పర్యవేక్షకురాలు రజిని శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు, పాఠ్య ప్రణాళికల తయారీ, విద్యార్థుల పఠన సామర్థ్యాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించారు. విద్యార్థుల్లో అభ్యసనా ఫలితాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు సమర్థవంతమైన బోధనా విధానాలను అవలంబించాలని సూచించారు. టీచింగ్ ఎయిడ్స్ వినియోగం, ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. సమావేశంలో ఎంఈవో శ్రీనివాసులు, హెచ్ఎం జి. శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఉదయగిరిలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం