*విత్తన గుళికలతో పంటలకు రక్షణ..*
* *ఎన్పీఎం డీపీఎం కన్నయ్య*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 22 కోట మండలం,*
*విత్తనాలను గుళికలుగా మార్చి చల్లడం వల్ల విత్తనాలకు చీమలు, పక్షుల నుంచి రక్షణ కల్పించవచ్చని ఎన్పీఎం డీపీఎం కన్నయ్య తెలిపారు. వర్షం కురిసినప్పుడు విత్తన గుళికల్లోని విత్తనాలు మొలకెత్తేలా చేయడంతో పాటు విత్తనాలు చెడిపోకుండా సంరక్షించడమే ఈ విధానం ఉద్దేశమని తెలిపారు. కోట మండలం చంద్రశేఖరపురం గ్రామంలో డీపీఎం ఆధ్వర్యంలో తొమ్మిది రకాల విత్తనాలను గుళికలుగా మార్చి పొలంలో చల్లారు. సాధారణంగా విత్తనాలను నేరుగా పొలంలో చల్లినప్పుడు చీమలు, పక్షులు వాటిని తినే అవకాశం ఉంటుందని, విత్తనాలను గుళికలుగా మార్చి చల్లడం వల్ల వాటికి రక్షణ లభిస్తుందని వివరించారు. వర్షం పడిన సమయంలో గుళికలకు తేమ అందడంతో విత్తనాలు మొలకెత్తుతాయని తెలిపారు. విత్తన సంరక్షణతో పాటు ప్రకృతి ఆధారిత సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎంటీ శ్రీనివాసులు, తిరుమల ఐసీఆర్పీలు ఎన్.భాగ్యలక్ష్మి, శివకుమారి, సౌజన్య, మల్లీశ్వరి, కావేరి, మునికుమారి, నీలిమ, సౌందర్య, గౌతమి పాల్గొన్నారు. స్థానిక రైతులు సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు.*
