Thursday, 24 September 2026

Tag: అనకాపల్లి జిల్లా

అనకాపల్లి

అనకాపల్లి వర్తక సంఘం రోటరీ ఐ హాస్పిటల్‌లో ఉచిత కంటి ఆపరేషన్లు

అనకాపల్లి: సెప్టెంబర్ 10 పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ అనకాపల్లి వర్తక సంఘం రోటరీ ఐ హాస్పిటల్‌లో ఈరోజు (సోమవారం, 31 ఆగస్టు 2026) ఉదయం డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 9 మంది రోగులకు ఉచితంగా ఐఓఎల్ (కంటి శుక్ల) ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రోగులకు ఉచిత మందులు, కళ్ళజోడు అందజేయడం జరిగింది. రోటరీ క్లబ్ సభ్యులు కే. మురళీకృష్ణ, వి. లక్ష్మణ్ గార్ల చేతుల మీదగా ఈ ఉచిత మందులు, కళ్ళజోడును పంపిణీ చేశారు. ఉప్పల రామకృష్ణ గారి సహకారంతో రొట్టెలు కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ ఐ హాస్పిటల్ చైర్మన్ బుద్ధ రమణాజీ, కో-చైర్మన్ కే. సతీష్, అధ్యక్షుడు సోమ సుందర్, కార్యదర్శి పుష్పం, కుశ్వంత్, మల్లేశ్వరరావు, ఎం. సూరిబాబు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

అనకాపల్లి

35 ఏళ్ల నిష్కళంక సేవలకు ఘన సత్కారం.. డీఎస్పీ జి.ఆర్.ఆర్. మోహన్‌కు ఆత్మీయ వీడ్కోలు

అనకాపల్లి, సెప్టెంబర్ 8 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): అనకాపల్లి సబ్ డివిజన్ ఇన్‌చార్జ్, స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) డీఎస్పీగా విశేష సేవలందించి పదవీ విరమణ పొందిన శ్రీ జి.ఆర్.ఆర్. మోహన్‌కు అనకాపల్లి పట్టణంలోని బొడ్డేడ కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ముఖ్యఅతిథిగా హాజరై మోహన్ దంపతులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ.. 35 ఏళ్ల సుదీర్ఘ పోలీస్ సేవలో మోహన్ నిష్కళంక రికార్డుతో, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించారని కొనియాడారు. ఎస్‌బీ విభాగాన్ని సమర్థంగా సమన్వయం చేస్తూ లా అండ్ ఆర్డర్, రాజకీయ, సామాజిక పరిణామాలపై వేగవంతమైన సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించారని ప్రశంసించారు. సర్వీసు చివరి రోజుల్లోనూ ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తు ఏర్పాట్లను సమర్థంగా పర్యవేక్షించారని పేర్కొన్నారు. రిటైర్మెంట్ అనంతరం కుటుంబంతో సంతోషంగా గడుపుతూ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మోహన్ భావోద్వేగంతో మాట్లాడుతూ తన 35 ఏళ్ల సేవా ప్రయాణంలో సహకరించిన ఉన్నతాధికారులు, సహచరులు, సిబ్బంది, కుటుంబసభ్యులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

అనకాపల్లి

బంగారం చోరీ కేసు లో ఇద్దరు నిందితులకు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష

దర్యాప్తు అధికారి, ఏపీపీలను అభినందించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ యలమంచిలి : పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బంగారం చోరీ కేసులో నిందితులకు న్యాయస్థానం ఆరు నెలల సాధారణ జైలు శిక్ష వితించిందని అన్నారు. యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 04/2024, సెక్షన్ 454, 380 ఐపీసీ కింద నమోదైన కేసులో ఎస్ఐ ఉపేంద్ర సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. యలమంచిలి ఏజేఎఫ్సీఎం న్యాయస్థానంలో సీసీ నెంబర్ 564/2025 పై విచారణ ముగిసిందని తెలిపారు. దర్యాప్తు అధికారి సమర్పించిన ఆధారాలు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశ్విని వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, నేరం రుజువు కావడంతో సెక్షన్ 428 సీఆర్‌పీసీ కింద ఇద్దరు ముద్దాయిలకు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఏ-1 పొలమరశెట్టి దుర్గాప్రసాద్ (24), తండ్రి మంగరాజు, రాజుపేట గ్రామం, కోటవురట్ల మండలం., ఏ-2 దాడి ఆదిబాబు (38), వృత్తి డ్రైవర్, తండ్రి వెంకటరమణ, జంగాల వీధి, నాగులాపల్లి గ్రామం, మునగపాక మండలాలకు చెందిన వీరిపై జైలు శిక్ష విధిస్తూ తీర్ప వచ్చిందని అన్నారు. ​ఈ కేసులో సమగ్ర దర్యాప్తుతో నేరాన్ని నిరూపించిన దర్యాప్తు అధికారి ఎస్ఐ ఉపేంద్ర, ప్రాసిక్యూషన్‌ను సమర్థవంతంగా నడిపించిన ఏపీపీ అశ్విని, కోర్టు లైజన్ సిబ్బంది లావణ్యలను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు.

అనకాపల్లి

నిర్మాణ పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్.

కొత్తూరులో నూతనంగా నిర్మిస్తున్న స్టేజి పనుల పరిశీలించినఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ యలమంచిలి : ​ పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ రాంబిల్లి మండలం కొత్తూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న స్టేజి పనులను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు, సంబంధిత సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కొత్తూరులో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన స్టేజి గ్రామంలో నిర్వహించే వివిధ సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ప్రజల అవసరాలను నిరంతరం గుర్తిస్తూ యలమంచిలి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు కూటమి ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, కూటమి నాయకులు, గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అనకాపల్లి

ఓటర్ జాబితాలో తప్పులు సరి చెయ్యాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వినతి

యలమంచిలి : పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ పురపాలక సంఘ పరిధిలో ఇటీవల చేపట్టిన వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా తయారీలో చోటుచేసుకున్న సాంకేతిక, భౌగోళిక లోపాలను తక్షణమే సరిదిద్దాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అర్రెపు నాగ త్రినాథ ఈశ్వర గుప్తా డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కార్యాలయాధికారికి వినతిపత్రం సమర్పించారు. గతంలో 13వ వార్డులో భాగమైన భవనం వీధి, కోర్టుపేట, గాంధీనగరం ప్రాంతాలను ప్రస్తుత విభజనలో భవనం వీధిని 11వ వార్డులోకి కలపడం అసంబద్ధంగా ఉందని తెలిపారు. రోడ్డు అవతల ఉన్న పాత ఎస్.సి కాలనీ పోలింగ్ స్టేషన్ పరిధిని పరిగణనలోకి తీసుకుంటే, ఈ మార్పు వయోవృద్ధులకు, స్థానిక ఓటర్లకు తీవ్ర అవాంతరాలను కలిగిస్తుందని పేర్కొన్నారు. భవనం వీధి ఓటర్లను వేర్వేరు పరిధుల్లోకి విడదీయడమే కాకుండా గాంధీనగరం, మోటూరి వారి వీధి, ఎయిర్‌టెల్ టవర్ సమీప ప్రాంతాల ఓటర్ల వివరాలు జాబితాలో అస్తవ్యస్తంగా నమోదయ్యాయని వెల్లడించారు. అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని, సదరు వార్డుల్లోని ఓటర్లందరినీ ఒకే సమగ్ర పరిధిలోకి తీసుకువచ్చి దోషరహితమైన నూతన ఓటర్ల జాబితాను అందుబాటులోకి తీసుకురావాలని ఈశ్వర గుప్తా కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ డాక్టర్ త్రినాథ్ పాల్గొన్నారు

అనకాపల్లి

ఆర్టీసీ పరిరక్షణకు ఎస్‌డబ్ల్యూఎఫ్ నిరసన దీక్షలు..

సీఐటీయూ, పలు సంఘాల మద్దతు అనకాపల్లి: పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించకుండా ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడపాలని, పినాకిల్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని, నెల్లూరు-2 డిపో పరిరక్షణకు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఎస్‌డబ్ల్యూఎఫ్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు.ఈ దీక్షలను ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పీఎన్‌వీ పరమేశ్వరరావు ప్రారంభించారు. ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నాయకులు బత్తిన అప్పారావు, ఎస్‌ఆర్‌ త్రిమూర్తులు, ఎంపీ నాయుడు, ఈఎస్‌ రావు దీక్షలో పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వీవీ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రైవేటీకరణ విధానాలను ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేశారు. పినాకిల్‌ సంస్థ ద్వారా 1,050 ఎలక్ట్రిక్‌ బస్సులను నడిపే ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసి, ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడపాలని కోరారు. ఇప్పటికే నాలుగు డిపోలను దీర్ఘకాలిక లీజుకు ఇవ్వడాన్ని కార్మికులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.నెల్లూరు-2 డిపో పరిరక్షణ కోసం ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఆధ్వర్యంలో 212 రోజులుగా నిరసన దీక్షలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోకపోతే కార్మికులు, ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గంటా శ్రీరామ్‌, అనకాపల్లి మండల కన్వీనర్‌ కాళ్ల తాలయ్య బాబు, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు బొప్పే ఉమామహేశ్వరరావు, పెంటకోట శ్రీనివాసరావు, అల్లు రాజు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుల

అనకాపల్లి

స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణమే నిలిపివేయాలి,పౌర సంక్షేమ సంఘం

అనకాపల్లి, పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ విద్యుత్ వినియోగదారులపై ఒత్తిడి, బెదిరింపులకు పాల్పడి స్మార్ట్ మీటర్లను బిగించడం తక్షణమే నిలిపివేయాలని అనకాపల్లి పట్టణ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సంఘం ఆధ్వర్యంలో APEPDCL అనకాపల్లి సూపరింటెండెంట్ ఇంజనీర్, కార్యనిర్వహణ ఇంజనీర్‌లను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ అదానీ స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణమే నిలుపుదల చేయాలని, వినియోగదారులపై వివిధ పేర్లతో మోపుతున్న అదనపు చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ విధానాలను విడనాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం కన్వీనర్ బి. ఉమామహేశ్వరరావు, కో-కన్వీనర్ పెంటకోట శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బొడ్డేడ అప్పారావు, కాళ్ల తాలయ్యబాబు, మద్దిల అప్పారావు, జె. రమేష్‌బాబు, గంటా శ్రీరామ్, పెంటకోట జగన్నాథం, అల్లు రాజు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

పోలవరం కాలువలో కాలు జారి వ్యక్తి గల్లంతు..

అనకాపల్లి జిల్లా సెప్టెంబర్ 7 ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) యలమంచిలి : ఉపాధి పని కోసం వెళ్లిన వ్యక్తి తిరిగి వస్తుండగా పోలవరం కాలువలో కాలు జారి నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. యలమంచిలి మండలంలో మర్రిబంద గ్రామానికి చెందిన కంచు అప్పలనాయుడు (58) ఎప్పటిలాగే సోమవారం నాడు తన గ్రామస్తులతో కలిసి ఉపాధి హామీ పనులకు పోలవరం కెనాల్ దాటి అవతలకు వెళ్లి, అక్కడ పనులు అయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో అతను పోలవరం కాలువ ఒడ్డున కాళ్ళు కడుక్కుంటుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కాలువ ప్రవాహంలో కొట్టుకుపోతుండగా గ్రామస్తులు నీటిలోకి దిగి వెతికే ప్రయత్నం చేసిన అతని ఆచూకీ కనిపించకపోవడంతో అతని తమ్ముడు అయిన కంచు సన్యాసిరావు ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్ఐ ఉపేంద్ర మిస్సింగ్ కేసు నమోది చేసినారు. ఎస్ఐ ఉపేంద్ర యలమంచిలి ఫైర్ స్టేషన్ సిబ్బంది, గ్రామస్తుల సహాయంతో వెతికించిన అతని ఆచూకీ సాయంత్రం వరకు లభించలేదు. పోలవరం కాలువ నీటి ప్రభావం ఎక్కువ ఉండడంతో కష్టతరం అయిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలవరం కాలువ యొక్క లోతు, ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు ముఖ్యంగా పిల్లలు ఎవరు కాలువలోకి దిగకుండా జాగ్రత్త వహించాలని ఎస్ఐ ఉపేంద్ర కోరారు.

అనకాపల్లి

7 రోజుల్లో న్యాయం,అధికారులకు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు!

అనకాపల్లి, సెప్టెంబర్ 7: ​ పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ బాధితులకు లభించే న్యాయమే పోలీసు వ్యవస్థకు అసలైన కొలమానమని అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (PGRS) కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి బాధితులు తరలివచ్చారు. ఎస్పీ గారు స్వయంగా బాధితులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజటి వేదికలో మొత్తం 51 ఫిర్యాదులను స్వీకరించారు. ​​సివిల్ వివాదాలు: భూ తగాదాలు, ఆస్తి గొడవలు, ఆర్థిక మోసాలు.​కుటుంబ సమస్యలు: భార్యాభర్తల వేధింపులు, గృహ కలహాలు.​ఇతరాలు: శాంతిభద్రతలు మరియు పౌర సమస్యలు.​ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ, అక్కడికక్కడే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి కఠిన ఆదేశాలు జారీ చేశారు.ప్రతి ఫిర్యాదుపై గరిష్టంగా వారం రోజుల్లోపు విచారణ పూర్తి చేసి బాధితుడికి న్యాయం చేయాలి.ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, కేవలం నిజాల ఆధారంగా పారదర్శకంగా దర్యాప్తు జరగాలి.స్టేషన్‌లో కేసు ఏ దశలో ఉందో బాధితులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వారిలో నమ్మకం నింపాలి.విచారణ ముగిసిన వెంటనే తీసుకున్న చర్యలపై పూర్తి నివేదికను జిల్లా కార్యాలయానికి పంపాలి. ​”ముఖ్యంగా మహిళల రక్షణ, భద్రత విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. మహిళలను, సామాన్యులను మోసగించే వారిపై చట్టపరంగా ఉక్కుపాదం మోపుతాం. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమ సమస్యలను తెలియజేయవచ్చు. మీకు అండగా నిలవడానికి జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.” — శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ (జిల్లా ఎస్పీ) ​ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు, ఎస్సై శ్రీనివాసరావు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అనకాపల్లి

జీవో 21, 31 రద్దు చేయాలి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల ర్యాలీ, రాస్తారోకో..

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ అనకాపల్లి: ఆటో, మోటార్ కార్మికులపై అధిక జరిమానాలకు కారణమవుతున్న జీవో నంబర్ 21, 31ను తక్షణమే రద్దు చేయాలని ఏఐటీయూసీ అనకాపల్లి జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో, మానవహారం చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం కారణంగా ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా తగ్గిందని, పెట్రోల్, డీజిల్ ధరలు, పన్నులు, ఇన్సూరెన్స్ భారాలతో జీవనం కష్టంగా మారిందన్నారు. డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ సదుపాయాలు కల్పించాలని కోరారు. 60 ఏళ్లు దాటిన డ్రైవర్లకు నెలకు రూ.10 వేల పెన్షన్, ప్రమాద బీమా, ఉచిత వైద్యం, విద్య అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కోన లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు, సంఘం నాయకులు పెద్దిరెడ్ల నాగేశ్వరరావు, కోరుబిల్లి జగదీష్, మహంతి శాంతి, షేక్ అన్సర్ బేగ్, చంద్రరావు, బాలు, వై.రాజు, అప్పన్నదొర, పి.వెంకటేష్, లోవరాజు, కన్నా అప్పారావు, సీపీఐ నాయకులు వియ్యపు రాజు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.