Wednesday, 9 September 2026
  • Home  
  • నిర్మాణ పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్.
- అనకాపల్లి

నిర్మాణ పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్.

కొత్తూరులో నూతనంగా నిర్మిస్తున్న స్టేజి పనుల పరిశీలించినఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ యలమంచిలి : ​ పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ రాంబిల్లి మండలం కొత్తూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న స్టేజి పనులను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు, సంబంధిత సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కొత్తూరులో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన స్టేజి గ్రామంలో నిర్వహించే వివిధ సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ప్రజల అవసరాలను నిరంతరం గుర్తిస్తూ యలమంచిలి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు కూటమి ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, కూటమి నాయకులు, గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కొత్తూరులో నూతనంగా నిర్మిస్తున్న స్టేజి పనుల పరిశీలించినఎమ్మెల్యే సుందరపు విజయకుమార్

యలమంచిలి : ​ పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
రాంబిల్లి మండలం కొత్తూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న స్టేజి పనులను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు, సంబంధిత సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కొత్తూరులో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన స్టేజి గ్రామంలో నిర్వహించే వివిధ సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ప్రజల అవసరాలను నిరంతరం గుర్తిస్తూ యలమంచిలి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు కూటమి ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, కూటమి నాయకులు, గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.