Saturday, 12 September 2026
  • Home  
  • పోలవరం కాలువలో కాలు జారి వ్యక్తి గల్లంతు..
- అనకాపల్లి

పోలవరం కాలువలో కాలు జారి వ్యక్తి గల్లంతు..

అనకాపల్లి జిల్లా సెప్టెంబర్ 7 ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) యలమంచిలి : ఉపాధి పని కోసం వెళ్లిన వ్యక్తి తిరిగి వస్తుండగా పోలవరం కాలువలో కాలు జారి నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. యలమంచిలి మండలంలో మర్రిబంద గ్రామానికి చెందిన కంచు అప్పలనాయుడు (58) ఎప్పటిలాగే సోమవారం నాడు తన గ్రామస్తులతో కలిసి ఉపాధి హామీ పనులకు పోలవరం కెనాల్ దాటి అవతలకు వెళ్లి, అక్కడ పనులు అయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో అతను పోలవరం కాలువ ఒడ్డున కాళ్ళు కడుక్కుంటుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కాలువ ప్రవాహంలో కొట్టుకుపోతుండగా గ్రామస్తులు నీటిలోకి దిగి వెతికే ప్రయత్నం చేసిన అతని ఆచూకీ కనిపించకపోవడంతో అతని తమ్ముడు అయిన కంచు సన్యాసిరావు ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్ఐ ఉపేంద్ర మిస్సింగ్ కేసు నమోది చేసినారు. ఎస్ఐ ఉపేంద్ర యలమంచిలి ఫైర్ స్టేషన్ సిబ్బంది, గ్రామస్తుల సహాయంతో వెతికించిన అతని ఆచూకీ సాయంత్రం వరకు లభించలేదు. పోలవరం కాలువ నీటి ప్రభావం ఎక్కువ ఉండడంతో కష్టతరం అయిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలవరం కాలువ యొక్క లోతు, ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు ముఖ్యంగా పిల్లలు ఎవరు కాలువలోకి దిగకుండా జాగ్రత్త వహించాలని ఎస్ఐ ఉపేంద్ర కోరారు.

అనకాపల్లి జిల్లా సెప్టెంబర్ 7 ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )

యలమంచిలి : ఉపాధి పని కోసం వెళ్లిన వ్యక్తి తిరిగి వస్తుండగా పోలవరం కాలువలో కాలు జారి నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. యలమంచిలి మండలంలో మర్రిబంద గ్రామానికి చెందిన కంచు అప్పలనాయుడు (58) ఎప్పటిలాగే సోమవారం నాడు తన గ్రామస్తులతో కలిసి ఉపాధి హామీ పనులకు పోలవరం కెనాల్ దాటి అవతలకు వెళ్లి, అక్కడ పనులు అయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో అతను పోలవరం కాలువ ఒడ్డున కాళ్ళు కడుక్కుంటుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కాలువ ప్రవాహంలో కొట్టుకుపోతుండగా గ్రామస్తులు నీటిలోకి దిగి వెతికే ప్రయత్నం చేసిన అతని ఆచూకీ కనిపించకపోవడంతో అతని తమ్ముడు అయిన కంచు సన్యాసిరావు ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్ఐ ఉపేంద్ర మిస్సింగ్ కేసు నమోది చేసినారు. ఎస్ఐ ఉపేంద్ర యలమంచిలి ఫైర్ స్టేషన్ సిబ్బంది, గ్రామస్తుల సహాయంతో వెతికించిన అతని ఆచూకీ సాయంత్రం వరకు లభించలేదు. పోలవరం కాలువ నీటి ప్రభావం ఎక్కువ ఉండడంతో కష్టతరం అయిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలవరం కాలువ యొక్క లోతు, ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు ముఖ్యంగా పిల్లలు ఎవరు కాలువలోకి దిగకుండా జాగ్రత్త వహించాలని ఎస్ఐ ఉపేంద్ర కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.