తిరుపతి రూరల్,సెప్టెంబర్ 7 పున్నమి ప్రతినిధి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు స్వామివారిని తిరుచానూరు శ్రీ విజయ గణపతి ఆలయ ధర్మకర్త, బీజేపీ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు పుష్పరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిజిటల్ భగవద్గీత ప్రదర్శన విశేషాలను స్వామివారికి వివరించి, వారి ఆశీస్సులు అందుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు స్వామివారు పుష్ప మునిరామ్ రెడ్డి దంపతులు సనాతన ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక సేవల కోసం చేస్తున్న కృషిని అభినందిస్తూ, మరిన్ని ధార్మిక కార్యక్రమాలను నిర్వహించాలని ,ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ,ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం పుష్పరెడ్డి దంపతులు స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.

