*ప్రాణాలతో కొట్ట మిట్లాడుతున్న మినీ లారీ డ్రైవర్..
దొరవారి సత్రం, పున్నమి న్యూస్, సెప్టెంబర్ 8
*దొరవారిసత్రం మండలం వెదురుపట్టు వద్ద జరిగిన ఘటన..*
*డ్రైవర్ క్షతగాత్రుడును నాయుడుపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించడం జరిగింది…*
దొరవారిసత్రం మండలం వెదురుపట్టు వద్ద టిప్పర్ లారీని.. ఓమిని లారీ ఢీ కొనడంతో లారీలో ఉన్న డ్రైవర్ ప్రాణాలతో కోట్టమిట్ట లాడుతున్నారు..
వివరాల్లోకి వెళితే తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం వెదురు పట్టువద్ద క్రాస్ రోడ్ లో సోమవారం రాత్రి 12 గంటల సమయంలో వెదురు పట్టుకు వెళుతున్న టిప్పర్ లారీ క్రాస్ రోడ్డు వద్ద హఠాత్తుగా తిరగడంతో వెనుక వైపు వస్తున్న ఓ మినీ లారీ టిప్పర్ ని ఢీకొనడంతో మినీలారీలో ఉన్న డ్రైవర్ కోన ఊపిరితో ఉండడంతోపాటు మినీ లారీ లోని లోపల ఇరుక్కునిపోయిన సంఘటన చోటు చేసుకుంది..
యాక్సిడెంట్ జరిగిన సంఘటన ప్రాంతాల్లో కొంతమంది లారీ డ్రైవర్లు సహాయంతో అద్దాలు పగలగొట్టి కోన ఊపిరితో ఉన్న లారీ డ్రైవర్ వ్యక్తిని కిందకు తీసుకురావడం జరిగింది..
అనంతరం సమాచారం అందుకున్న దొరవారిసత్రం పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రుడు డ్రైవర్ను నేషనల్ హైవే అంబులెన్స్ మొబైల్లో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..
అనంతరం యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో గంటసేపు పాటు ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది.. పోలీసులు లైన్ క్లియర్ చేయడంతో ఎక్కడ వాహనాలు అక్కడికి వెళ్లిపోవడం జరిగింది…
