Wednesday, 23 September 2026

Tag: అనకాపల్లి జిల్లా

అనకాపల్లి

అచ్యుతాపురం నుండి యలమంచిలి వరకు భారీ బైక్ ర్యాలీ..!

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : యలమంచిలి :జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని యలమంచిలి నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో అచ్యుతాపురం నుంచి యలమంచిలి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అచ్యుతాపురంలోని ఎమ్మెల్యే నివాసం నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీలో యలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన జనసైనికులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ యలమంచిలి గుర్రప్ప కల్యాణ మండపానికి చేరుకున్నారు. అనంతరం గుర్రప్ప కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, జనసైనికులు కలిసి పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ యువజన విభాగం నూతన లోగోతో పాటు ప్రత్యేక గీతాన్ని కూడా పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఎన్ డిఏ ప్రభుత్వం అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలను అందించడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. గోదావరి జలాలు జిల్లాకు రావడంతో పండగ వాతావరణం నెలకొందని తెలిపారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. అభివృద్ధి, సంపద సృష్టి ఎన్ డిఏ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో యలమంచిలి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ తెలిపారు. నియోజకవర్గాన్ని సుమారు రూ.1,500 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం తదితర రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజాన శేషు, యలమంచిలి టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు బొద్దపు శ్రీనివాసరావు, కర్రీ ఝాన్సీ, రమేష్ నాయుడు, లాలం సోమనాయుడు, లోవరాజు, గోపి, కొఠారు నరేష్, భాస్కర్, చిరంజీవి, పల్లా సత్యనారాయణ, రాంబిల్లి మండలశాఖ అధ్యక్షుడు పప్పల నూకన్నదొర, నాయకులు, వీర మహిళలు, జనసైనికులు తదురులు పాల్గొన్నారు.

అనకాపల్లి

అనకాపల్లి జిల్లాకు గోదావరి జలకళ…..!

పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు జలహారతి – పాయకరావుపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : అనకాపల్లి: పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలను తీసుకువచ్చే మహత్తర కార్యక్రమానికి అడుగు పడింది. పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ క్రాస్ రెగ్యులేటర్ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు అందుతున్నాయన్న సూచికగా పాయకరావుపేట వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లా పరిధి వరకు చేరుకున్న గోదావరి జలాలకు ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు.గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం వ్యవసాయానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి లభ్యత పెంచడంతో పాటు ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని నాయకులు పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్న గోదావరి జలాల కల సాకారమయ్యే దిశగా ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్, జిల్లా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే, రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, రాష్ట్ర గనులు–భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర తదితర ప్రముఖులు కార

అనకాపల్లి

ఏటికొప్పాకలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు..!

జనసైనికుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు.. భారీగా పాల్గొన్న గ్రామ ప్రజలు అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 2 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఎలమంచిలి నియోజకవర్గం ఏటికొప్పాక గ్రామంలో జనసైనికుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసైనికులు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కేక్ కట్ చేసి, పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో జనసేన పార్టీ మరింత ముందుకు సాగాలని నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నగిరెడ్డి అచ్చయ్య నాయుడు, గొంతుమూర్తి కొండయ్య నాయుడు, అన్నం స్వరజీరావు, రావి చలపతితో పాటు పలువురు జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అనకాపల్లి

వరికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు….!

అనకాపల్లి జిల్లా ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) యలమంచిలి, కొత్తపాలెం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చేపట్టడం జరిగినది.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మోహన్ రావు మాట్లాడుతూ వరి పంటకు ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు వేసుకోవాలని దానికి అనుగుణం గా మండలంలో 800 హెక్టార్లకు చిరుధాన్యాలను ఇండెంట్ పెట్టడం జరిగిందని తెలియజేశారు. కొత్తపాలెం గ్రామంలో తక్కువ వర్షపాతం నమోదు కావడం చేత వరి నారు మడులు వాడిపోతున్నట్టుగా గుర్తించడం జరిగినది. దీనికిగాను 19 19 19 నీటిలో కరిగే ఎరువు 5 గ్రాములు ఒక లీటర్ నీటికి లేదా రెండు గ్రాములు యూరియా ఒక లీటర్ నీటికి లేదా 13 0 45 ఎరువు 5 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే నీటి ఎద్దడి నుంచి రక్షించుకోవచ్చు అని తెలియజేశారు. చిరుధాన్యాలు రాగులు, గంట్లు, ఉలవలు, జనము తదితర విత్తనాలను ఇండెంట్ పెట్టి రైతు సేవ కేంద్రం ద్వారా వరికి ప్రత్యామ్నాయంగా రైతుల అవసరాల మేరకు ఇండెంట్ పెట్టడం జరిగిందని తెలియజేశారు ఈ. కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు అరుణ, రైతులు ఆడారి. జగన్నాథం, ఆడారి. సోమనాయుడు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాలువ జలహారతికి ఏటికొప్పాక నుంచి భారీ తరలింపు..!

అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 2 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): పాయకరావుపేటలో నిర్వహించనున్న పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాలువ జలహారతి కార్యక్రమానికి ఏటికొప్పాక గ్రామం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. బీజేపీ మండల అధ్యక్షులు అగ్రహారపు కుమార్ స్వామి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, ప్రజలు ఉత్సాహంగా పాయకరావుపేటకు బయలుదేరారు. పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాలువ ద్వారా సాగునీటి వనరులు అందుబాటులోకి రావడం వల్ల రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నాయకులు తెలిపారు. వ్యవసాయ రంగానికి సాగునీటి భరోసా కల్పించడంతో పాటు ప్రజల తాగునీటి అవసరాలకు కూడా ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకమని పేర్కొన్నారు. జలహారతి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఏటికొప్పాక నుంచి భారీగా తరలివెళ్లారు. గ్రామ పెద్దలు, యువత, మహిళలు, బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్రహారపు కుమార్ స్వామి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్ర అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ఎంతో కీలకమని అన్నారు. ఎడమ కాలువ ద్వారా సాగునీరు అందితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాజెక్ట్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఏటికొప్పాక నుంచి బీజేపీ శ్రేణులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాలువ జలహారతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేందుకు అందరూ సమష్టిగా పాయకరావుపేటకు పయనమయ్యారు.

అనకాపల్లి

పోలవరం లెఫ్ట్ కెనాల్ ప్రారంభోత్సవానికి పేట బయ్యవరం నుంచి కూటమి శ్రేణులు..!!

అనకాపల్లి జిల్లా : ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) యలమంచిలి నియోజకవర్గం, పేట బయ్యవరం: పోలవరం లెఫ్ట్ కెనాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాయకరావుపేట నియోజకవర్గంలోని పేట బయ్యవరం గ్రామం నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళా రైతులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఎలమంచిలి మండలం తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎడ్ల చినబాబు, మాజీ వైస్ ఎంపీపీ గొన్నబోతుల శేషు, మాజీ సర్పంచ్ గంజి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మగ్గా బాబురావు, పులపర్తి నీటి సంఘం వైస్ చైర్మన్ ఎడ్ల కాంతారావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళా రైతులు, తెలుగుదేశం పార్టీ ఆడపడుచులు కార్యక్రమానికి బయలుదేరారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ ప్రారంభంతో ఈ ప్రాంత రైతులకు సాగునీటి పరంగా మరింత ప్రయోజనం కలుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళా రైతులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అనకాపల్లి

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేత సుందరపు ఈశ్వరరావు సుడిగాలి పర్యటన

యలమంచిలి నియోజకవర్గంలో “జోహార్ వైఎస్సార్” నినాదాలు అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 2 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): దివంగత ముఖ్యమంత్రి, ప్రజా నాయకుడు డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా యలమంచిలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ ప్రజా సంక్షేమం, రైతుల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన కృషిని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సుందరపు ఈశ్వరరావు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించారు. పెద్దపల్లి అగ్రహారం, ఉప్పరాపల్లి, సర్వసిద్ధి తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు “జోహార్ వైఎస్సార్.. జోహార్ వైఎస్సార్.. జై కాంగ్రెస్.. జై జై కాంగ్రెస్” అంటూ నినాదాలు చేయడంతో ఆయా గ్రామాలు మార్మోగాయి. వైఎస్సార్ పేదల పాలిట పెన్నిధి అని సుందరపు ఈశ్వరరావు కొనియాడారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి సంక్షేమ కార్యక్రమాలతో పేదలు, రైతుల జీవితాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే వైఎస్సార్‌కు అందించే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

అనకాపల్లి

సంక్షేమ, అభివృద్ధి ఫలాలను వివరించిన పట్టణ అధ్యక్షుడు నానాజీ…!

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : యలమంచిలి : మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో సోమవారం ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యలమంచిలి పట్టణ పార్టీ అధ్యక్షుడు గొర్లె శివన్నారాయణ (నానాజీ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి, గత రెండు సంవత్సర కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, జిల్లాలో భారీగా పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. యువతకు పెద్దపీట వేస్తూ వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ బొద్ధపు. శ్రీనివాసరావు, వార్డు ఇంచార్జ్ బొద్ధపు. నాగేశ్వరరావు, యూత్ అధ్యక్షుడు నమ్మి.రమణ, జనసేన వార్డు అధ్యక్షుడు బోద్ధపు గణేష్, వార్డు సెక్రటరీ పందల సూరిబాబు, దాంట్ల విజయకుమార్ తో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అనకాపల్లి

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి నియోజకవర్గ స్థాయి సమావేశం..

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : సెప్టెంబర్ 2న పాయకరావుపేట ‘జలహారతి’ని జయప్రదం చేయాలని పిలుపు ​యలమంచిలి :పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందం, అనకాపల్లి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ​ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ సెప్టెంబర్ 2న పాయకరావుపేటలో జరగనున్న ‘జలహారతి’ కార్యక్రమంలో కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలి. గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు రావడం ఒక గొప్ప వరమని అన్నారు. నాయకులు, కార్యకర్తలు డోర్-టు-డోర్ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని తెలిపారు. కొత్తపేట ఎమ్మెల్యే ​బండారు సత్యానందం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రాంతాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని, జలహారతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయం చేయాలని అన్నారు. అనకాపల్లి జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు ​బత్తుల తాతయ్య బాబు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే నీటి పారుదల ప్రాజెక్టును పూర్తి చేసి జలహారతి ఇస్తామని సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం నడుచుకునే ప్రభుత్వం మనదని తెలిపారు. ​ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, పార్టీ బలోపేతంపై కూలంకషంగా చర్చించారు. ​ఈ కార్యక్రమంలో టిడిపి టౌన్ ప్రెసిడెంట్ నానాజీ, రూరల్ ప్రెసిడెంట్ సన్యాసి నాయుడు, రాంబిల్లి మండల పార్టీ ప్రెసిడెంట్ లాలం భరత్, అచ్చుతాపురం మండల ప్రెసిడెంట్ పేలా తులసీరామ్, నాలుగు మండలాల అబ్జర్వర్లు, స్టేట్ డైరెక్టర్లు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జిలు, టిడిపి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అనకాపల్లి

సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు.. 1600 మంది పోలీసులతో భద్రత

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 31 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల సందర్భంగా నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ‘జలహారతి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 2న పాయకరావుపేటకు రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆధ్వర్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) నిర్వహించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సుమారు 1600 మంది పోలీసులతో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 03 అదనపు ఎస్పీలు, 09 డీఎస్పీలు, 36 సీఐలు, 90 ఎస్సైలు సహా పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. రోప్ పార్టీలు, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ పార్టీ బలగాలను మోహరిస్తున్నారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, ముఖ్య మార్గాల్లో నిరంతర తనిఖీలు చేపట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.