పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ఇన్‌చార్జ్‌గా వంతల దేవదాసు నియమితులయ్యారు. ఈ మేరకు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి అధికారికంగా ప్రకటించారు. గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా దేవదాసు రెండుసార్లు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం డుంబ్రిగూడ మండలం సాగర పంచాయతీ బీజేపీ ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతు సంఘాలను ఏర్పాటు చేసి, రైతులను సంఘటితం చేస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పార్టీ నాయకులు తెలిపారు. రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రైతు సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్థాయికి చేరువ చేయాలని ఆకాంక్షించారు. కిసాన్ మోర్చాను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు దేవదాసుకు శుభాకాంక్షలు తెలిపారు.

డుంబ్రిగుడ: కిసాన్ మోర్చా మన్యం జిల్లా ఇన్‌చార్జ్‌గా ఎంపీటీసీ వంతల దేవదాసు