ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ

Tag: Raja

తిరుపతి

పాత బడికి పగుళ్లు.. కొత్త బడి నిర్మాణం అసంపూర్తి! విద్యార్థుల భద్రతపై ఆందోళన.. నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని డిమాండ్..

దొరవారి సత్రం: మండలంలోని వేడగిరిపాలెం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల భవనం పైకప్పు, గోడలు దెబ్బతిని పెచ్చులు ఊడిపడే పరిస్థితి నెలకొంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా కొత్త పాఠశాల భవనం నిర్మాణానికి చర్యలు చేపట్టినప్పటికీ, నిర్మాణం పూర్తికాకపోవడంతో సమస్య కొనసాగుతోంది. అసంపూర్తిగా ఉన్న నూతన భవనాన్ని త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. పాఠశాల భవనం పరిస్థితిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిశీలన చేపట్టాలని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరుతున్నారు. అసంపూర్తిగా ఉన్న నూతన పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, విద్యార్థులకు సురక్షితమైన వాతావరణంలో విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తిరుపతి

రోశనూరు –రాజుపాలెంలో మట్టి తరలింపుపై ఆరోపణలు…

సింపోలో కంపెనీ పరిసరాల నుంచి మట్టి తరలింపు? — అధికారులు తక్షణమే పరిశీలించాలని స్థానికుల విజ్ఞప్తి… దొరవారి సత్రం మండలం : రోశనూరు –రాజుపాలెం ప్రాంతంలో సింపోలో కంపెనీ పరిసరాల నుంచి మట్టిని తరలిస్తున్నారు అన్ని ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. మట్టి తరలింపునకు సంబంధిత శాఖల నుంచి అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు… ఈ వ్యవహారంపై రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి వాస్తవాలను నిర్ధారించాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు లేకుండా మట్టి తరలింపు జరుగుతున్నట్లు విచారణలో తేలితే, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని కోరుతున్నారు…

తిరుపతి

కుప్పారెడ్డిపాలెం లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు – పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామస్థులు దొరవారి సత్రం మండలం: కుప్పారెడ్డి పాలెం గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తూ గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలుస్తున్నారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వినాయకుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు ప్రార్థించారు.

తిరుపతి

దొరవారిసత్రం మండలం హైవేపై మూడు వాహనాలు ఢీ..

దొరవారిసత్రం మండలం హైవేపై మూడు వాహనాలు ఢీ.. దొరవారిసత్రం మండలం పరిధిలోని హైవేపై మూడు భారీ వాహనాలు ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది..ఈ ప్రమాదంలో వాహనాలు ఒకదానికొకటి ఢీకొని రహదారి పక్కన నిలిచిపోయాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. భారీ వాహనాలు ప్రమాదానికి గురికావడంతో హైవేపై కొంతసేపు వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎవరైనా గాయపడ్డారా, ప్రాణనష్టం జరిగిందా అనే వివరాలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రమాదంపై పోలీసులు, సంబంధిత అధికారులు విచారణ చేపట్టి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. హైవేపై భారీ వాహనాల వేగ నియంత్రణతో పాటు ప్రమాదాల నివారణకు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

తిరుపతి

ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలి

అడవిలో నేలకూలిన విద్యుత్ స్తంభం.. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలి.. తిరుపతి జిల్లా. దొరవారి సత్రం మండలం. కుప్పారెడ్డిపాలెం :అడవి ప్రాంతంలో విద్యుత్ స్తంభం నేలకూలిపోయి ప్రమాదకర పరిస్థితి నెలకొంది. స్తంభం కూలిపోవడంతో విద్యుత్ లైన్లు కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు, రైతులు, పశువులు రాకపోకలు సాగిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన నెలకొంది.. నేలకూలిన విద్యుత్ స్తంభాన్ని సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి, ప్రమాదానికి కారణమయ్యే పరిస్థితులను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. కూలిపోయిన స్తంభం స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

తిరుపతి

కానిస్టేబుల్‌కు ప్రమోషన్.. పోలీస్‌స్టేషన్‌లో అభినందనల వెల్లువ…

కానిస్టేబుల్‌కు ప్రమోషన్.. పోలీస్‌స్టేషన్‌లో అభినందనల వెల్లువ… దొరవారి సత్రం: దొరవారి సత్రం మండల పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యంకు ప్రమోషన్ …కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన నేపథ్యంలో ఆయనకు ఉన్నత పదవికి ప్రమోషన్ లభించింది. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది సుబ్రహ్మణ్యన్ని అభినందించారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ, విధి నిర్వహణ, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ సేవలందించడం అభినందనీయమని సిబ్బంది పేర్కొన్నారు. ప్రమోషన్. పొందిన సుబ్రహ్మణ్యానికి పోలీస్ అధికారులు, తోటి సిబ్బందిలు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

తిరుపతి

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి చెందాడు

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి చెందాడు.. కుప్పారెడ్డిపాళెం దొరవారి సత్రం మండలం తెలియని వ్యక్తి వెళ్తున్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది… ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు తెలిసింది సమాచారం అందుకున్న అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరినప్పటికీ మరణించిన వ్యక్తిని హాస్పిటల్ తరలించుకుంటా వెళ్లిపోయిందని అక్కడున్న స్థానికులు ఆరోపిస్తున్నారు.. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు మృతదేహాన్ని హాస్పిటల్ కి తరలించడం జరిగింది

తిరుపతి

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి..

*హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి.. దొరవారి సత్రం మండలం తల్లంపాడు గ్రామ సమీపంలోని హైవే పై శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి మృతి చెందాడు.. తల్లంపాడు గ్రామానికి చెందిన చింతపూడి చంగయ్య అనే వ్యక్తి నెల్లూరు నుంచి ఇంటికి వెళుతుండగా క్రాసింగ్ రూట్ దాటుతుండగా అకస్మాత్తుగా కారు వచ్చి ఢీ కొట్టింది అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం రోడ్డు సిబ్బందులు పోలీస్ అధికారులు అతనిని హాస్పిటల్ తరలించడం జరిగింది

తిరుపతి

కుప్పారెడ్డి పాలెంలో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు

*కుప్పారెడ్డి పాలెంలో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు* *కుప్పారెడ్డి పాలెం (దొరవారిసత్రం), ఆగస్టు 28 (పున్నమి న్యూస్):* రాఖీ పండుగ సందర్భంగా తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డి పాలెం గ్రామంలోని తన నివాసంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పున్నమి న్యూస్ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జ్ మద్దాలి వెంకయ్య కు, ఆయన అక్క వరలక్ష్మి, చెల్లి ప్రమీల ఇంటికి విచ్చేసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. అనంతరం మద్దాలి వెంకయ్య మాట్లాడుతూ, అక్కాచెల్లెళ్ల ప్రేమానుబంధానికి గుర్తు ఈ రాఖీ పండుగ అని, ప్రతి ఒక్కరూ తమ తోబుట్టువులను ప్రేమగా చూసుకోవాలని కోరారు.

తిరుపతి

కుప్పారెడ్డి పాళెం గ్రామంలో వీధి లైట్ల సమస్య

కుప్పారెడ్డి పాళెం గ్రామంలో వీధి లైట్ల సమస్య దొరవారిసత్రం మండలం , కుప్పారెడ్డి పాళెం గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా వీధి లైట్లు లేకపోపోవడంతో రాత్రి సమయంలో గ్రామ ప్రజలు తీవ్ర ఇబంధులు ఎదురుకొంటున్నారు ముఖ్యంగా మహిళలు, వృద్దులు, చిన్న పిల్లలు రాత్రి వేళ్ళలో బయటకు రావడానికి ఇబందిగా వుంది కావున సంబంధితా అధికారులు వెంటనే స్పందించి, గ్రామంలోని వీధి లైట్ల సమస్య పరిశీలించి అవసరమైన చోట కొత్త లైట్లు ఏర్పటు చేసి సమస్య శాశ్వతంగా పరిష్కారించాలని గ్రామ ప్రజలు తరపున కోరుకుంటున్నాము