Monday, 14 September 2026
  • Home  
  • కుప్పారెడ్డిపాలెం లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- తిరుపతి

కుప్పారెడ్డిపాలెం లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు – పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామస్థులు దొరవారి సత్రం మండలం: కుప్పారెడ్డి పాలెం గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తూ గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలుస్తున్నారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వినాయకుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు ప్రార్థించారు.

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు – పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామస్థులు
దొరవారి సత్రం మండలం: కుప్పారెడ్డి పాలెం గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తూ గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలుస్తున్నారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వినాయకుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు ప్రార్థించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.