Monday, 20 April 2026
  • Home  
  • ముస్తాబాద్‌లో ప్రతిభకు పట్టం కట్టిన ముదిరాజ్ సంక్షేమ సంఘం
- రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్‌లో ప్రతిభకు పట్టం కట్టిన ముదిరాజ్ సంక్షేమ సంఘం

ముస్తాబాద్ ఏప్రిల్ పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండలంలో ‌ఈ రోజు 20-04-2026న ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్‌లో అత్యధిక మార్కులు సాధించిన ముదిరాజ్ విద్యార్థిని–విద్యార్థులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పిట్ల విట్టల్ గారు మాట్లాడుతూ, విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడం సంఘం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మండల కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించగా, CWFI రాష్ట్ర కమిటీ సభ్యులు గీస బిక్షపతి గారు ముఖ్యంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెఎలుపుల పూజా, నీరటి వైష్ణవి, జినుక శ్రీజ, గొడుగు రాణి, దుద్దెడ శ్రీజ తదితర ప్రతిభావంతులైన విద్యార్థినులను శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో జినుక మల్లేశం, బోయిని గంగాధర్, షాడో అశోక్, చిగురుపండర్ రాజు, మల్లేశం శేఖర్ తదితర మండల కమిటీ సభ్యులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమం మండల కేంద్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, విద్యార్థులు మరియు వారి కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని నింపింది.

ముస్తాబాద్ ఏప్రిల్ పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్ మండలంలో ‌ఈ రోజు 20-04-2026న ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్‌లో అత్యధిక మార్కులు సాధించిన ముదిరాజ్ విద్యార్థిని–విద్యార్థులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పిట్ల విట్టల్ గారు మాట్లాడుతూ, విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడం సంఘం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మండల కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించగా, CWFI రాష్ట్ర కమిటీ సభ్యులు గీస బిక్షపతి గారు ముఖ్యంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెఎలుపుల పూజా, నీరటి వైష్ణవి, జినుక శ్రీజ, గొడుగు రాణి, దుద్దెడ శ్రీజ తదితర ప్రతిభావంతులైన విద్యార్థినులను శాలువాలతో సత్కరించి అభినందించారు.
కార్యక్రమంలో జినుక మల్లేశం, బోయిని గంగాధర్, షాడో అశోక్, చిగురుపండర్ రాజు, మల్లేశం శేఖర్ తదితర మండల కమిటీ సభ్యులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ సన్మాన కార్యక్రమం మండల కేంద్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, విద్యార్థులు మరియు వారి కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని నింపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.