అడవిలో నేలకూలిన విద్యుత్ స్తంభం..
ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలి..
తిరుపతి జిల్లా. దొరవారి సత్రం మండలం. కుప్పారెడ్డిపాలెం
:అడవి ప్రాంతంలో విద్యుత్ స్తంభం నేలకూలిపోయి ప్రమాదకర పరిస్థితి నెలకొంది. స్తంభం కూలిపోవడంతో విద్యుత్ లైన్లు కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు, రైతులు, పశువులు రాకపోకలు సాగిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన నెలకొంది..
నేలకూలిన విద్యుత్ స్తంభాన్ని సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి, ప్రమాదానికి కారణమయ్యే పరిస్థితులను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. కూలిపోయిన స్తంభం స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.



