Wednesday, 23 September 2026
  • Home  
  • పాత బడికి పగుళ్లు.. కొత్త బడి నిర్మాణం అసంపూర్తి! విద్యార్థుల భద్రతపై ఆందోళన.. నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని డిమాండ్..
- తిరుపతి

పాత బడికి పగుళ్లు.. కొత్త బడి నిర్మాణం అసంపూర్తి! విద్యార్థుల భద్రతపై ఆందోళన.. నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని డిమాండ్..

దొరవారి సత్రం: మండలంలోని వేడగిరిపాలెం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల భవనం పైకప్పు, గోడలు దెబ్బతిని పెచ్చులు ఊడిపడే పరిస్థితి నెలకొంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా కొత్త పాఠశాల భవనం నిర్మాణానికి చర్యలు చేపట్టినప్పటికీ, నిర్మాణం పూర్తికాకపోవడంతో సమస్య కొనసాగుతోంది. అసంపూర్తిగా ఉన్న నూతన భవనాన్ని త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. పాఠశాల భవనం పరిస్థితిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిశీలన చేపట్టాలని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరుతున్నారు. అసంపూర్తిగా ఉన్న నూతన పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, విద్యార్థులకు సురక్షితమైన వాతావరణంలో విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

దొరవారి సత్రం: మండలంలోని వేడగిరిపాలెం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల భవనం పైకప్పు, గోడలు దెబ్బతిని పెచ్చులు ఊడిపడే పరిస్థితి నెలకొంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాత భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా కొత్త పాఠశాల భవనం నిర్మాణానికి చర్యలు చేపట్టినప్పటికీ, నిర్మాణం పూర్తికాకపోవడంతో సమస్య కొనసాగుతోంది. అసంపూర్తిగా ఉన్న నూతన భవనాన్ని త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
పాఠశాల భవనం పరిస్థితిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిశీలన చేపట్టాలని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరుతున్నారు. అసంపూర్తిగా ఉన్న నూతన పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, విద్యార్థులకు సురక్షితమైన వాతావరణంలో విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.