– 86 వేలకు లడ్డు వేలం పాట పాడిన పసుపులేటి వెంకటరమణ
తిరుపతి జిల్లా చిట్వేలి మండలం సకల శుభకార్యాలకు మొదట వినాయకునీ ప్రార్థిస్తాము వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి సంబరాలు అంగరంగ వైభవంగా ఆకాశాన్ని అంటే అంత సంబరంగా వేడుకలు జరిగాయి అత్యంత భక్తితో నేటి వరకు వినాయకుని ఆరాధించి ఉదయము నుండే పిల్లలకు ఆటలు పోటీలు రంగవల్లులు ఉట్టి కొట్టడం అనేక రకాల కార్యక్రమాలతో సంబరాలు జరిగాయి భారీ స్థాయిలో పసుపులేటి వారు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు గ్రామస్తులు మొత్తం మరియు బయట ప్రాంతాల వారు కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అలాగే లడ్డు వేలం పాట ఎన్నడూ లేని విధంగా 86 వేల రూపాయలు పసుపులేటి శ్రీనివాసులు కొడుకు వెంకటరమణ లడ్డు పాట పాడడం జరిగింది కరతాల ధ్వనులతో గ్రామస్తులంతా ఆయనను వారి ఇంటి వరకు ఆ ప్రసాదముతో మేళా తాళాలతో తీసుకుపోవడం జరిగింది చివరిగా ప్రతి ఇంట స్వామి వారు ఊరేగింపు జరిగినప్పుడు ప్రసాదాన్ని స్వీకరించడం తిరిగి ఆ గ్రామస్తులకు ప్రతి ఇంటి వారికి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ప్రసాదమును కూడా ఇవ్వడం జరిగింది ఆ గ్రామస్తులు ఐక్యతకు సమైక్యతకు అందరూ కూడా కలిసి ఉండడం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది గ్రామస్తులు మరియు యువకులు మాట్లాడుతూ వినాయక చవితి సంబరాలు అనేటివి గ్రామ ఐక్యతను సూచించే విధంగా ఉండాలే కాని గ్రామంలో అనైక్యతకు దారితీయకూడదని తమ గ్రామంలో ఎప్పుడు కూడా కులమతాలకు అతీతంగా వినాయక చవితి సంబరాలు కలిసిమెలిసి చేసుకోవడం జరుగుతుందని గ్రామంలోని యువకులు తెలియజేశారు పెద్దలు పిల్లలు మహిళలు యువత భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది


