దొరవారిసత్రంలో నాణ్యతకు నిలయం S4 టిఫిన్ సెంటర్ – మూడేళ్లు పూర్తి, నాలుగో ఏడాదిలోకి!*
*దొరవారిసత్రం:*తిరుపతి జిల్లా ఒక చిన్న కలతో ప్రారంభమైన S4 టీ & టిఫిన్ సెంటర్ నేటికి 3 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని, నాలుగో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఇది కేవలం ఒక హోటల్ విజయం కాదు, ఒక కుటుంబం యొక్క కష్టం, నమ్మకం, కస్టమర్ల అభిమానానికి నిదర్శనం. దొరవారిసత్రం ప్రధాన సెంటర్ లో శివకుమార్ గారు స్థాపించిన *S4 TEA CAFÉ & COOL DRINKS / S4 Tea & Tiffen Center* తక్కువ కాలంలోనే నాణ్యమైన టిఫిన్లు, రుచికరమైన టీ, పరిశుభ్రతకు పెట్టింది పేరుగా నిలిచింది. చిన్న టీ కొట్టుగా మొదలై ఇప్పుడు దొరవారిసత్రం ప్రాంతంలో ప్రతి ఒక్కరి నోటా వినిపించే పేరుగా మారింది. ఉదయం వేడి వేడి ఇడ్లీ, దోశ, పూరీ నుండి సాయంత్రం టీ, స్నాక్స్ వరకు నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా, తక్కువ ధరలో అందించడం ఈ సెంటర్ ప్రత్యేకత. ఈ సందర్భంగా నిర్వాహకులు *శివకుమార్ గారు* మాట్లాడుతూ.. “మూడేళ్లుగా మమ్మల్ని ఆదరిస్తూ, మాపై నమ్మకం ఉంచిన ప్రతి కస్టమర్ దేవుళ్లకు, మా కుటుంబ సభ్యులకు, సహచర మిత్రులకు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా ధన్యవాదాలు. మీ అభిమానమే మా బలం. ఇదే నమ్మకంతో నాలుగో ఏట కూడా మరింత నాణ్యతతో సేవ చేస్తాం” అని తెలిపారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కష్టపడి ఈ సంస్థను ఈ స్థాయికి తీసుకురావడం పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. కస్టమర్లే దేవుళ్లు అనే నానుడిని నిజం చేస్తూ S4 నిరంతరం ముందుకు సాగుతోంది. *S4 యాజమాన్యానికి 4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు!* *వెన్యూ: S4 Tea & Tiffen Center, దొరవారిసత్రం.


