Thursday, 1 October 2026

Tag: Amaravati

అమరావతి

అమరావతికి ప్రత్యేక పోలీసింగ్ జోన్

అమరావతిలో ప్రత్యేక కమిషనరేట్‌కు బదులుగా విస్తృత గుంటూరు కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక పోలీసింగ్ జోన్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాజధాని ప్రాంత భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వేగవంతమైన స్పందన కోసం ఈ నిర్మాణాన్ని రూపుదిద్దుతున్నట్లు సమాచారం. అమలు విధివిధానాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

అమరావతి

ఏపీలో 3,736 మద్యం షాపుల కొనసాగింపు

ఏపీలో 2026-27కు 3,736 మద్యం దుకాణాలను కొనసాగిస్తూ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్‌ పాలసీ ప్రకటించింది. అక్టోబర్‌ 1 నుంచి 2027 సెప్టెంబర్‌ 30 వరకు ఇది అమల్లో ఉంటుంది. వీటిలో 3,396 ఓపెన్‌ కేటగిరీ, 340 గీత కులాలకు కేటాయించిన షాపులు. ప్రస్తుత లైసెన్సుదారులు 38% రెన్యువల్‌ రిటైల్‌ ఎక్సైజ్‌ పన్నుతో మరో ఏడాది కొనసాగవచ్చు. రూ.35 వేల ప్రాసెసింగ్‌ ఫీజు ఉంటుంది. రెన్యువల్‌ కాని షాపులను లాటరీ ద్వారా కేటాయిస్తారు. ప్రతి షాపులో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఏఐ కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానించనున్నారు. ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌, ఈ-ఇన్వెంటరీతో స్టాక్‌, విక్రయాలపై డిజిటల్‌ నిఘా ఉంటుంది. ఎంఆర్‌పీ ఉల్లంఘనలు, నకిలీ లేదా అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటారు. అనధికార విక్రయానికి తొలి నేరంపైనే రూ.25 లక్షల జరిమానా విధించనున్నారు. వినియోగదారులు 14405, ఎక్సైజ్‌ సురక్ష యాప్‌, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. తిరుపతిలో నిర్దిష్ట ప్రాంతాల్లో షాపుల ఏర్పాటుపై ఆంక్షలు కొనసాగుతాయి.

అమరావతి

సంక్షేమం నుంచి సాధికారతే లక్ష్యం: సీఎం చంద్రబాబు

సంక్షేమ పథకాలు అందించడంతోనే ఆగిపోకుండా పేదలు ఆర్థికంగా సాధికారత సాధించే వరకు ప్రభుత్వం అండగా ఉండాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. 8వ కలెక్టర్ల కాన్ఫరెన్సులో సూపర్ సిక్స్, సంక్షేమ పథకాల అమలును సమీక్షించారు. కొత్త పెన్షన్లకు ముందే ఫ్యామిలీ యూనిట్ మ్యాపింగ్ చేపట్టాలని, పెద్ద కుటుంబాలకు అధిక ప్రయోజనాలు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కుటుంబ సభ్యులందరికీ తలో 5 కిలోల రేషన్ బియ్యం అందాలని స్పష్టం చేశారు. సంక్షేమానికి రూ.1.50 లక్షల కోట్లు, పెన్షన్లకే రూ.75 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, P4 అమలు, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

అమరావతి

రివ్యూలు కాదు.. రిజల్ట్స్ కావాలి: సీఎం చంద్రబాబు

8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం చేశారు. ప్రజాసేవకులుగా పనిచేయాలని, ఈగోలకు తావివ్వొద్దని సూచించారు. రివ్యూలకే పరిమితం కాకుండా ఫలితాలు చూపాలని స్పష్టం చేశారు. ఫైళ్లు, ప్రజా ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండటం అభివృద్ధి, న్యాయం పెండింగ్‌లో ఉన్నట్టేనన్నారు. Reactive Governance నుంచి Proactive Governance‌కు మారాలని పిలుపునిచ్చారు. సమస్యలను దాచకుండా వాస్తవాలను వెల్లడించాలని, ఫేక్ ప్రచారానికి వెంటనే కౌంటర్ ఇవ్వాలని ఆదేశించారు. శాఖలు, జిల్లాలు ఉత్తమ పనితీరులో పోటీపడాలని పేర్కొంటూ **“One State–One Vision–One Team–One Mission”** స్వర్ణాంధ్ర లక్ష్యమన్నారు.

అమరావతి

అసెంబ్లీకి రాకుండా రాజకీయాలెందుకు?: చంద్రబాబు నాయుడు

అమరావతిలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించడం తన రాజకీయ చరిత్రలో చూడలేదన్నారు. సభలో ప్రజా సమస్యలపై చర్చిస్తేనే వాటికి విలువ ఉంటుందని పేర్కొన్నారు. గ్రూప్-1 అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే డీఎస్సీ-2025పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం తగ్గించిన బీసీ రిజర్వేషన్లను తమ ప్రభుత్వం పునరుద్ధరించిందని తెలిపారు

అమరావతి

తూమాటి ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ ఛైర్మన్ పదవికి ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్లు శాసనమండలి ఛైర్మన్ అధికారికంగా ప్రకటించారు. అనంతరం మండలి సభ్యులు మాధవరావుకు అభినందనలు తెలిపారు. శాసనమండలి కార్యకలాపాలను సమర్థంగా నిర్వహిస్తూ సభా సంప్రదాయాలు, నియమాలను పరిరక్షించేందుకు కృషి చేస్తానని తూమాటి మాధవరావు పేర్కొన్నారు.

అమరావతి

గురుకుల్‌కు స్థలం రిజిస్ట్రేషన్

అమరావతిలో శ్రీ స్వామినారాయణ గురుకుల్ క్యాంపస్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. తుళ్లూరు మండలం నేక్కల్లులో కేటాయించిన 4.235 ఎకరాల స్థలానికి ఏపీ సీఆర్‌డీఏ అధికారులు రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ప్రభుత్వం స్థలం అప్పగించడంపై హర్షం వ్యక్తం చేసిన పూజ్య సుఖ వల్లభ దాస్ స్వామీజీ, పూజ్య మంత్ర స్వరూప్ దాస్ స్వామీజీ, స్కూల్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అమరావతి

సీఎంఓలో సమన్వయ లోపం.. చంద్రబాబు పాలనకు మైలేజ్ దూరం!

అపార పరిపాలనా అనుభవమున్న సీఎం చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రజల్లో మైలేజ్ రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సీఎంఓలో సమన్వయ లోపం, అధికారుల మధ్య ఆధిపత్య పోరు నిర్ణయాల అమలుపై ప్రభావం చూపుతున్నాయనే విమర్శలున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల విజ్ఞప్తుల పరిష్కారంలోనూ జాప్యం జరుగుతోందనే ఆరోపణల నేపథ్యంలో సీఎంఓ పనితీరును చంద్రబాబు పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.